మానవ మృగంలా ప్రజల మధ్యే తిరుగుతు ముగ్గురు అమ్మాయిలను పొట్టనపెట్టుకున్న కిరాతకుడు శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హాజీపూర్‌లో ముగ్గురు స్కూల్ విద్యార్ధినిలను అత్యాచారం, హత్య చేసి అనంతరం పాడుబడ్డ బావిలో పాతిపట్టి సైకో శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలపై ఆరా తీసుకున్న పోలీసుకులకు వీస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఒళ్లంతా కామాన్ని నింపుకున్న ఈ కీచకుడు సోషల్ మీడియాలోను అమ్మాయిలే టార్గెట్‌గా వారిని చెరబట్టే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. తన ఫేస్‌బుక్ ఖాతాలో 631 మంది స్నేహితులు ఉంటే వారిలో 600 మందికి పైగా అమ్మాయిలే ఉన్నారు.
అమ్మాయిలకు ఫ్రెండ్ రిట్వేస్ట్ పంపుతూ వారితో స్నేహం చేసే ప్రయత్నం చేసేవాడు. ఎవరైన కాస్త చనువుగా ఉండే వారిని వంచించాలని చూసేవాడు. హాజీపూర్ ఘటనతో శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పరిచయంతో ఇంకెవరినైనా ఏమైనా చేసి ఉంటాడా అనేది అనుమానంగా మారింది. ఆ వివరాలపై పోలీసులు ఆరా తీసుకున్నారు. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి గతంలో కర్నూల్‌లో ఓ యువతిని హత్య చేసి పీపాలో కుక్కాడు. ఈ నేపథ్యంలో వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల్లో అదృశ్యమైన యువతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. దాంతో హాజీపూర్ చుట్క్కుటు పక్కల ప్రాంతాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్న శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసేందుకు మరోమారు అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. అభం శుఖం తెలియని ముగ్గురు అమ్మాయిలను పొట్టనపెట్టుకున్న సైకో శ్రీనివాస్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలని హాజీపూర్ గ్రామ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు.
The post శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలు.. 600 మంది అమ్మాయిలు..సంచలన విషయాలు వెలుగులోకి …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2vzBfB3


No comments:
Post a Comment