రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ కొత్త గళాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. గాయకులతోనే కాకుండా సినిమా హీరోలు, హీరోయిన్ల చేత కూడా పాటలు పాడిస్తుంటాడు. ఇప్పటికే సిద్ధార్థ్, ఎన్టీయార్, మమతా మోహన్‌దాస్, శృతీహాసన్ మొదలైన వాళ్లతో దేవిశ్రీ పాటలు పాడించిన సంగతి తెలిసిందే. `మహర్షి` హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా సంగీతంలో ప్రవేశం ఉందట. అయితే ఆ విషయం తెలియకపోవడంతో ఆమెను సరిగ్గా వాడుకోలేకపోయానంటున్నాడు దేవిశ్రీప్రసాద్.
తాను గిటార్ వాయిస్తానని, పాటలు కూడా పాడతానని, తనతో చాలా సినిమాలు చేసినప్పటికీ దేవిశ్రీ ఆ విషయం తెలుసుకోలేకపోయాడని బుధవారం జరిగిన `మహర్షి` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పూజ చెప్పింది. భవిష్యత్తులోనైనా తన ట్యాలెంట్‌ను దేవి శ్రీ ఉపయోగించుకోవాలని కోరింది. దీనికి దేవి శ్రీ స్పందిస్తూ.. `పూజతో చాలా సినిమాలు చేశాను. ఆమె ట్యాలెంట్ గురించి ఇప్పుడే తెలిసింది. ఆమె పాటలు పాడుతుందని నాకు తెలియదు. భవిష్యత్తులో ఆమెతో కచ్చితంగా పాడిస్తాన`ని దేవిశ్రీ చెప్పాడు.
The post పూజతో చాలా సినిమాలు చేశాను.. ఆ విషయం ఇప్పుడే తెలిసింది: దేవిశ్రీ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2PGqPbY
No comments:
Post a Comment