etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, May 2, 2019

వారణాసి నుంచి తేజ్‌బహదూర్ నామినేషన్ తిరస్కరణ, ఎందుకో తెలుసా …?

వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఎన్నికల బరిలోకి దిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాజీ జవాను తేజ్‌బహదూర్ యాదవ్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. తగిన డాక్యుమెంట్లు సమర్పించలేదంటూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్పీ-బీఎస్‌పీ నామినీగా తేజ్‌బహదూర్ ఇటీవల వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

కాగా, తన నామినేషన్‌ను రద్దు చేయడంపై తేజ్‌ బహదూర్ ఘాటుగా స్పందించారు. ఈసీ నిర్ణయం సరైనది కాదని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని తెలిపారు. మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు తగిన ఎవిడెన్స్ సమర్పించాలని ఈసీ కోరిందని, ఇందుకు అనుగుణంగా తాను స్పందించినప్పటికీ ఇవాళ ఉదయం 11 గంటల లోపు తాము కోరిన సమాచారం అందలేదంటూ తన నామినేషన్‌ను ఈసీ రద్దు చేసిందన్నారు. అధికారులపై ఏ విధంగా ఒత్తిడి తెస్తున్నారో దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన అన్నారు. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తేజ్ బహదూర్ చెప్పారు.

అవినీతి లేదా అవిధేయత కారణంగా ఆయనను ప్రభుత్వం డిస్మిస్ చేసిందా లేదా అనే దానిపై సర్టిఫెకెట్ సమర్పించాలంటూ తేజ్ బహదూర్‌కు వారణాసి జిల్లా రిటర్నింగ్ అధికారి మంగళవారం సాయంత్రం నోటీసు పంపారు. కాగా, రిటర్నింగ్ అడిగిన దానికి తాము సాక్ష్యం సమర్పించినప్పటికీ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తేజ్ బహదూర్ తరఫు న్యాయవాది రాజేష్ గుప్తా మీడియాకు తెలిపారు.

The post వారణాసి నుంచి తేజ్‌బహదూర్ నామినేషన్ తిరస్కరణ, ఎందుకో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2vzB0G9

No comments:

Post a Comment