మనుషులు ఒకలాగా, పాటలు ఒకలాగా, డ్యాన్స్‌లు మరొకలాగా చేస్తూ వీడియోలు పోస్టు చేసే టిక్ టాక్ యాప్ చాలా విధ్వంసాలు సృష్టించింది. ఏదో కొత్తగా చేసేద్దాం. అని ప్రయోగం చేసిన ఓ టిక్ టాక్ స్టార్ నవ్వులు పూయించేసింది. పడిపోయా.. పడిపోయా పాటకు డ్యాన్స్ వేస్తూ.. మెట్లపై నుంచి నిజంగా పడిపోయింది. అది ప్రేమో ఏమో తెలిసేలోపు అన్నంత వరకు బాగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిన అమ్మాయి.. నే పడిపోయా పడిపోయా అన్న లిరిక్స్ దగ్గరకు వచ్చేసరికి.. నిజంగా అమ్మాయి మెట్లపై నుంచి పడిపోతూ ఉంటుంది. ఇదంతా యాధృచ్ఛికంగానే కెమెరాలో రికార్డ్ అయిపోయింది. ఇది వైరల్ అయిపోయింది. ఏ రేంజ్ లో అంటే.. జాతీయ స్థాయిలో.
డీకే బోస్ సినిమాలో పడిపోయా.. పడిపోయా పాటను హమ్ చేస్తూ.. ఒక తెలుగు మహిళ మెట్ల పైకి ఎక్కుతుంది. చివరి మెట్టు ఎక్కి కూర్చుందామనకుంటుండగా అక్కడి నుంచి నిజంగానే పడిపోయింది. ఎక్కే మెట్లను చూడకుండా కెమెరానే చూసుకుంటూ ఉండటంతోనే ఆమెకు ఇన్ని కష్టాలు పాపం. ఈ వీడియోను గోంజ్ బాయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో #Tiktok #tiktokindia #tiktokfail #tiktoktelugu #telugu అనే ట్యాగ్‌లతో పోస్టు చేశాడు. ఇలా పడిపోయా పడిపోయా అంటూ పడిపోకుండా ఉండాలంటే కాస్త కెమెరాల వైపే కాదు చేసే పనిపైనా ధ్యాస ఉంచాలని కామెంట్లు పెడుతున్నారు.
#Tiktok #tiktokindia #tiktokfail #tiktoktelugu #telugu usshooo!
pic.twitter.com/pTltKBkq3l
— Gonzi Boy (@Pr4th1k) May 15, 2019
The post పడిపోయా.. పడిపోయా అని పాడుతూ.. నిజంగానే పడిపోయిన అమ్మాయి, వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2JM06tN
No comments:
Post a Comment