etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, May 2, 2019

రాత్రి పూట అన్నంకు బ‌దులు చ‌పాతీలే బెట‌ర్‌.. ఎందుకంటే..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆరోగ్యం ప‌ట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. అందుక‌నే చాలా మంది అధికంగా బ‌రువు ఉంటే దాన్ని త‌గ్గించుకోవ‌డం కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రోజూ జిమ్‌కు వెళ్ల‌డం, వ్యాయామం, యోగా చేయ‌డం, ఆహార, జీవ‌న విధానాల‌ను మార్చుకోవ‌డం, స‌రైన పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని స‌మ‌యానికి తీసుకోవ‌డం.. వంటి అనేక ప‌నులు చేస్తున్నారు. దీంతో బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొందుతున్నారు. అయితే ఆహారం తీసుకునే విష‌యానికి వ‌స్తే రాత్రి పూట అన్నం కాకుండా చ‌పాతీల‌ను తింటే ఇంకా ఎక్కువ‌గా ఉప‌యోగం ఉంటుంది. మ‌రి రాత్రిపూట అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రాత్రి పూట అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ర‌క్తంలో షుగర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.
2. అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది.
3. చ‌పాతీల‌ను త‌యారు చేసే గోధుమ పిండిలో మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ ఉంటాయి. ముఖ్యంగా కాప‌ర్‌, జింక్‌, అయోడిన్‌, పొటాషియం, కాల్షియం ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. ముఖ్యంగా దంతాలు, ఎముక‌లు దృఢంగా మారుతాయి. అలాగే ర‌క్తం కూడా బాగా త‌యార‌వుతుంది.
4. రోజూ రాత్రి పూట చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బద్దకం త‌గ్గుతాయి.
5. అజీర్తి ఉండే వారు చ‌పాతీల‌ను తింటే ఆ స‌మ‌స్య‌ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
6. చ‌పాతీలు చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. అందువ‌ల్ల రాత్రి పూట వాటిని తింటే త్వ‌ర‌గా జీర్ణ‌మై త్వ‌ర‌గా నిద్ర వ‌స్తుంది. నిద్ర‌కు ఆటంకం ఉండ‌దు.
7. చ‌పాతీల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఐర‌న్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.

The post రాత్రి పూట అన్నంకు బ‌దులు చ‌పాతీలే బెట‌ర్‌.. ఎందుకంటే..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2PGqc26

No comments:

Post a Comment