ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి సర్వసాధారణంగా ఎవరికైనా వస్తాయి. దీంతో ఆసుపత్రిల చుట్టూ తిరుగుతూ డబ్బులు వృధా చేస్తుంటాము.. అయితే మనం మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే పైన చెప్పిన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
1. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనెలను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని అలాగే చప్పరించాలి. ఇలా రోజుకు 3 నుండి 4 సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గుతాయి.
2. చిన్న అల్లం ముక్కను చప్పరించాలి. లేదా అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగినా సేవించాలి.. చిటికెడు వామును తీసుకుని బాగా నలపాలి. దాన్ని దవడన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది..
3. రోజుకు 3 పూటలా కొన్ని తులసి ఆకులను తీసుకుని బాగా నమిలి ఆ రసం మింగుతూ ఉంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. అలా కాకపోతే తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగినా ఫలితం కనబడుతుంది..
4. తేనె, అల్లంరసం, నిమ్మరసంలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా కలిపి తాగాలి.. దీంతో శరీర రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.. దగ్గు, జలుబు తగ్గుతాయి.
5. తేనె, మిరియాల పొడిలను ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. జలుబు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీన్ని రెండు పూటలా తీసుకోవాల్సి ఉంటుంది.
6. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి కలిపి తాగినా చాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి మాయమవుతాయి. వేడి నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి కలిపి తాగితే జలుబు, దగ్గు మాయమవుతాయి.
The post జలుబు, దగ్గు నివారణకు చక్కటి చిట్కాలు, ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2vzBagJ
No comments:
Post a Comment