అమ్మానాన్న ముందే చెప్పారు.. వాడొద్దే నీకు సరైనోడు కాదే అని.. అయినా ఎందుకో అతడే నచ్చాడు.. పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది. చేసేదేం లేక నీ ఖర్మ.. నీకు ఎలా రాసి పెట్టి వుంటే అలా జరుగుతుంది అని పెళ్లి ఏర్పాట్లు చేశారు. అమ్మాయి మెళ్లో మూడు ముళ్లు వేయించారు. అప్పటికి కాని అర్ధం కాలేదు ఆమెకు. తనని చేసుకున్న వాడికి పబ్‌జీ పిచ్చి పీక్స్‌లో ఉందని. లేకపోతే ఏవిటి.. శుభమా అని పెళ్లి జరుగుతుంటే.. ముందు జరగబోయే ముద్దూ ముచ్చట్ల గురించి ఆలోచించకుండా పబ్‌జీ గేమ్ ఆడుతున్న అతగాడిని చూసి చిర్రెత్తుకొచ్చింది.
అమ్మానాన్న ఎందుకు వద్దన్నారో అప్పుడు తెలిసి వచ్చింది. చేసేదేం లేక చూస్తూ ఊరుకుంది. ఎలాగో మూడు ముళ్లు వేశాడు. బంధువులందరూ వచ్చి ఆశీర్వదించి, గిప్ట్‌లు ఇస్తుంటే కూడా పట్టించుకోకుండా పబ్‌జీ గేమ్‌లో మునిగిపోయాడు. పాడు పబ్‌జీ గేమ్ ఎవడు కనిపెట్టాడో కాని.. ఎంత మంది జీవితాలను నాశనం చేస్తుందో అని మనసులో అనుకుంది పాపం పెళ్లి కూతురు. జీవితంలో ఒక్కసారే జరిగే ముచ్చటైన వేడుక పెళ్లి.. ఆ మధుర క్షణాలను ఆస్వాదించకుండా పబ్‌జీ గేమ్ ఆడుతున్న వ్యక్తిని చూసి నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The post పందిట్లో పెళ్లి కొడుకు.. ఏం పని చేస్తున్నాడో చుడండి, వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2PMm2pC
No comments:
Post a Comment