etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, May 2, 2019

ఇలాంటి డ్రెస్సుల్లో చూస్తే అబ్బాయిలు ఊరుకుంటారా.. : ఆంటీ షాకింగ్ కామెంట్స్, వైరల్ వీడియో

నా ఇష్టం.. నాకిష్టమైన డ్రెస్ నేను వేసుకుంటా.. అడగడానికి మీరెవరు.. అని రోడ్డు మీదకు వచ్చేటప్పడు ఎలా పడితే అలా డ్రెస్ వేసుకుని వస్తానంటే ఎలా.. ఆడవారి చూపులే అదాటుగా అటు వెళ్లి పోతుంటాయి. మరి మగాడు ఎలా చూస్తాడో తెలియంది ఏముంది.. జరుగుతున్న ఎన్నో అరాచకాలకు డ్రెస్ కారణం కాకపోవచ్చు కానీ.. అది కూడా ఓ కారణమన్నది కాదనలేని నిజం.. అంటూ ఢిల్లీకి చెందిన ఓ ఆంటీ అమ్మాయిలు వేసుకునే డ్రెస్‌లపై నిప్పులు చెరిగింది. అంతటితో ఆగకుండా మరి కొంచెం ముందుకు వెళ్లి ఇలాంటి డ్రెస్‌లు వేసుకున్న అమ్మాయిల్ని రేప్ చేయండి అంటూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసకు వారి వేషధారణే కారణమంటూ ఆంటీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇద్దరు స్నేహితులు ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్‌లో స్నాక్స్ తింటుండగా.. వారి వద్దకు ఓ మహిళ వెళ్లి పొట్టిగా ఉన్న ఇలాంటి దుస్తులు వేసుకున్నందుకు సిగ్గుగా లేదా అని వారితో వాదనకు దిగింది. ఇలాంటి దుస్తులు వేసుకున్న మహిళలను రేప్ చేయండి అంటూ రెస్టారెంట్‌లో ఉన్న పురుషులకు చెప్పింది. దీంతో షాక్ తిన్న సదరు మహిళలు ఆమెను అనుసరించి .. ఆమె వికృత మనస్థత్వాన్ని ప్రశ్నించారు. మీరన్న మాటలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. క్షమాపణలు చెప్పండి అని పదే పదే అడిగినా ఆమె వారిని పట్టించుకోలేదు. మేము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పే హక్కు మీకు లేదు.. అయినా పసిపాపల నుంచి వృద్ధులను కూడా వదలని మృగాళ్లున్న ఈ సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చేవిగా ఉంటాయి.

ఓ మహిళ అయివుండి తోటి మహిళల గురించి ఇలా మాట్లాడడం సరికాదు అని ఆమెపై మండిపడ్డారు. అయినా ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. తన మాటలు వెనక్కు తీసుకోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అలా మాట్లాడిన మహిళ వివరాలు తెలియరాలేదు.

The post ఇలాంటి డ్రెస్సుల్లో చూస్తే అబ్బాయిలు ఊరుకుంటారా.. : ఆంటీ షాకింగ్ కామెంట్స్, వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2vzAVSR

No comments:

Post a Comment