నెల ఆదాయం రూ.15,000లోపు ఉన్నవారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 60 ఏళ్ల వయసు వచ్చిన దగ్గరి నుంచి నెలకు కచ్చితంగా రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. అయితే స్కీమ్‌లో చేరే వ్యక్తి ఎన్‌పీఎస్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఈపీఎఫ్‌వో స్కీమ్‌లలో చేరి ఉండకూడదు.
పీఎం ఎస్‌వైఎం స్కీమ్‌లో చేరాలని భావించే వారు దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పేరును నమోదు చేసుకోవచ్చు. నెలకు కొంత మొత్తం చొప్పున 60 ఏళ్లు వచ్చేంత వరకు కట్టాలి. తర్వాత సబ్‌స్క్రైబర్ నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ సబ్‌స్క్రైబర్ చనిపోతే పెన్షన్‌లో సగం భాగం భాగస్వామికి వస్తుంది.
ఇంటి పనులు చేసేవారు, వీధి కార్మికులు, ఇటుకల తయారీ కూలీలు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ పనులు చేసేవారు ఇలా ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో చేరాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ కచ్చితంగా కావాలి. ఆదాయ పత్రం అవసరం లేదు. స్వీయ ధ్రువీకరణతో స్కీమ్‌లో చేరవచ్చు. తప్పుడు సమాచారం అందిస్తే పెనాల్టీలు చెల్లించాలి. ఆటో డెబిట్ సౌకర్యం ఉంది. మీ అకౌంట్ నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి.
నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించొచ్చు. ఎంత చెల్లించాలనేది వయసు ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. మీరు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు చెల్లిస్తుంది. రెండు కలిపి మీ స్కీమ్‌లో జమవుతాయి.
మీకు 18 ఏళ్లు ఉంటే నెలకు రూ.55 కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.55 జమ చేస్తుంది. అదే మీకు 25 ఏళ్ల ఉంటే నెలకు రూ.80 చెల్లించాలి. 30 ఏళ్ల ఉంటే రూ.105, 35 ఏళ్ల ఉంటే రూ.150 చెల్లించాలి.
The post pm sym: రూ.15,000లోపు ఆదాయం ఉంటే నెలకు రూ.3,000 పెన్షన్! – here is all you need to know about pm shram yogi maan dhan yojana pension scheme appeared first on Etechlooks.
No comments:
Post a Comment