etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 15, 2019

వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే! నిన్న రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఏం జరిగిందో..?

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకాది హత్యేనని పోలీసులు అంటున్నారు. పోర్టుమార్టం రిపోర్టులో మర్డర్‌గా తేలిందని పోలీసులు చెబుతున్నారు. పోర్టుమార్టం అనంతరం వివేకా పార్థివదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. రిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలున్నట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. నుదిటిపై లోతైన రెండు గాయాలు, తలవెనుక భాగంలో.. తొడ భాగం, చేతిపైనా గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు.

పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే వివేకా శరీరంపై బలమైన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా తల, చెయ్యికి గాయాలు కావడంపై అనుమానం మరింత పెరిగింది. పోస్టుమార్టం అనంతరం వివేకా భౌతికకాయాన్ని పులివెందులలోని నివాసానికి తరలించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వివేకానందరెడ్డి తలపై, చేతిపై గాయాలున్నాయని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ వెల్లడించారు. హత్య ప్రదేశంలో ఫింగర్ ప్రింట్స్ దొరికాయని ఆయన చెబుతున్నారు. గురువారం రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ఏం జరిగిందో తెలుసుకున్నామని ఎస్పీ చెప్పారు.

The post వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే! నిన్న రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఏం జరిగిందో..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2HnifxG

No comments:

Post a Comment