మెగాస్టార్ చిరంజీవి చుట్టూ హీరోయిన్స్ చేరి ఫొటోలకు పోజులిచ్చారు. పైగా వారంతా ఆ రోజుల్లో చిరంజీవితో కలిసి వెండితెరపై చిందులేసిన హీరోయిన్స్ కావడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుక్కల్లో చంద్రుడు అంటూ మెగా అభిమానులు ఈ పిక్‌ని తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో చిరంజీవి చుట్టూ రాధిక, నదియా, టబు, సుహాసిని, జయసుధ, మీన, ఖుష్బూలతో పాటు చిరు సతీమణి సురేఖ ఉన్నారు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ తారలు తళుక్కుమన్నారు. అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ఈ వేడుకకు సతీసమేతంగా చిరంజీవి, కృష్ణంరాజులు విచ్చేయగా.. రాధిక, నదియా, టబు, సుహాసిని, జయసుధ, మీన, ప్రభాస్, రానా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరుతో కలిసి వీరంతా ఫొటోలు దాగారు. కాగా ఈ ఫొటోలని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న రాధిక ‘‘వెంకటేశ్ కుమార్తె పెళ్లి రిసెప్షన్.. ఈ అద్భుతమైన సాయంత్రం, మధురమైన జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. కృష్ణంరాజు, చిరంజీవితో ఎంతో సరదా సమయం’’ అని ట్వీట్ చేసింది. అదేవిదంగా ‘‘హ్యాండ్సమ్ మెగాస్టార్ చుట్టూ అందాల తారలు రాధిక, నదియా, టబు, సుహాసిని, జయసుధ, మీన, ఆయన సతీమణి సురేఖ’’ అని పేర్కొంటూ ఖుష్బూ ట్వీట్ చేసింది.
The post చుట్టూ హీరోయిన్స్ మధ్యలో చిరు.. వైరల్ అవుతున్న పిక్, ఎక్కడో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HXKna1
No comments:
Post a Comment