etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 20, 2019

కారం వలన మన శరీరానికి కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇకపై కారం ఎక్కువగా తింటారు..!

భారతీయులు ప్రతీరోజు తాము చేసుకునే అనేక రకాల వంటలలో కారం విరివిగా ఉపయోగిస్తారు. భారతీయులు కూరల్లో కొందరు పచ్చిమిరపకాయలను వేస్తే మరికొందరు ఎండుకారం వేస్తుంటారు. ఏ కూర అయినా సరే కారం పడకపోతే మనకు ముద్ద దిగదు. మన దేశంలో మిరప ఎక్కువగానే పండిస్తారు. మనకు గుంటూరు కారానికి ప్రపంచంలో మంచి పేరు ఉంది. మన తెలుగువారు కారం తినకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు. కానీ కొందరు మాత్రం కారం తినేందుకు విముఖత ప్రదర్శిస్తుంటారు. మనం ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ప్రతీ ఒక్కరూ కారం ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే కారంతో మన శరీర ఆరోగ్యాన్ని చాలా వరకూ కాపాడుకోవచ్చు.
కారం తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఎండు మిరపకాయల పొడి (కారం)లో ఉండే పలు రకాల సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
2. మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం అధిక బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. వాపులను తగ్గిస్తుంది.
3. అల్సర్లు ఉన్నవారు కారం ఎక్కువగా తినరాదని చెబుతుంటారు. కానీ సైంటిస్టులు చేసిన పరిశోధనల ప్రకారం.. కారంలో ఉండే పలు సమ్మేళనాలు జీర్ణ సమస్యలను పోగొడతాయని తేలింది.
4. కారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
5. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
6. తలనొప్పి, కీళ్ల నొప్పులు ఉన్నవారు కారం తింటే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. దగ్గు, జలుబు ఉన్నవారు కారం తింటే త్వరగా ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

The post కారం వలన మన శరీరానికి కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇకపై కారం ఎక్కువగా తింటారు..! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2Gnv8EV

No comments:

Post a Comment