etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 14, 2019

జెర్రి కుడితే వెంటనే ఇలా చెయ్యండి, మీకు నొప్పె తెలియదు, ఎలానో తెలుసా …!

జెర్రి.. ఈ పేరు వింటేనే చాలా మందికి ఒళ్ళు జలదరిస్తుంది. జెర్రిలో ఉండే విషం పెద్దగా ప్రాణాంతకం కాకపోయినా ఇది కుడితే మాత్రం ఒళ్ళు హూనం అవ్వడం ఖాయం.. ఎక్కువగా ముసుగు, మజ్జు, కుళ్ళు ప్రాంతాల్లో ఉండే ఈ జెర్రి చిన్న చిన్న పురుగుల్ని తిని బతుకుతుంది. ఇది రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ ఆహార అన్వేషణ చేస్తుంది. ఇవి కుట్టినప్పుడు ఓ రెండు మూడు గంటల పాటు తట్టుకోలేని నొప్పి పెడుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

* జెర్రి కుట్టిన వెంటనే కుట్టిన ప్రదేశాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి
* జెర్రి కుట్టిన భాగాన్నివేడి నీటిలో ముంచిన గుడ్డతోనే కడగాలి. తద్వారా వేడి వలన విష ప్రభావం తగ్గే అవకాశముంది.
* జెర్రి కుట్టిన శరీర భాగం పై పసుపును రాయాలి.
*ఆ ప్రదేశం లో వెల్లుల్లి పేస్టును పట్టుగా వెయ్యటం వలన నొప్పి, వాపు కూడా తగ్గుతాయి.

లక్షణాలు:

* జెర్రి కుట్టిన సమయం నుంచి 10 గంటల వరకు విపరీతమైన మంట తో కూడిన భాధ వుంటుంది
* జెర్రి కుట్టిన ప్రదేశం లో నల్లని లేదా యెర్రని మచ్చ పడుతుంది
* జెర్రి కుట్టిన ప్రదేశం ఎర్రగా మారి , మంట వాపు కలుగుతుంది
* నిద్రించే సమయంలో జర్రి కుడితే వచ్చే భాదను భరించడం చాలా కష్టం

ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు..

* జెర్రి ఇంటిలోనికి రాకుండా కిటికీలకు మెస్(చిన్న ఇనుప రంద్రాల జల్లెడ) లు ఏర్పాటు చేయాలి.
* కిటికీల వద్ద నప్తాలిన్ గోలీలను (కలరా ఉండలు ) ఉంచుకోవాలి.
* చలి కాలం లో ప్రతి రోజు ఇంటిలోని రంద్రాల వద్ద వేపాకుల వీలైతే పసుపు చల్లాలి.
* ప్రతీ వారం ఫ్లోర్ ను శుద్ధి చేసుకోవాలి.
* ఇంటి గడపలకు పసుపు ను రాయడం వలన యాంటిబయోటిక్ ప్రభావంతో జెర్రి లే కాకుండా ఇతర విష కీటకాలు కూడా ఇంటిలోపలకి రావు. తద్వారా విషపూరిత జెర్రెలను ఇంటి ధరిచేరనీయకుండా చూసుకోవచ్చు.

The post జెర్రి కుడితే వెంటనే ఇలా చెయ్యండి, మీకు నొప్పె తెలియదు, ఎలానో తెలుసా …! appeared first on DIVYAMEDIA.



source http://www.divyamedia.in/jerry-in-very-safe/

No comments:

Post a Comment