etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, March 23, 2019

వెంకీ కూతురి పెళ్లి వేడుకల్లో సల్మాన్‌.

టాలీవుడ్ సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహ వేడుకలు జైపూర్ లో వైభవంగా నిర్వహిస్తున్నారు దగ్గుబాటి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రీత పెళ్లి జరుగుతోంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఆశ్రీత, వినాయక్ పెద్దలు అంగీకారంతో ఒక్కటవుతున్నారు.

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో జైపూర్ లో భారీ ఎత్తున వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. దగ్గుబాటి కుటుంబంతో పాటు నాగచైతన్య, సమంత, పలువురు సినీ తారలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వెంకీ కూతురి పెళ్లిలో సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్‌ కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకకు సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆశ్రీత, వినాయక్‌ల వివాహం రేపు(24న) జరగనుంది. త్వరలో హైదరాబాద్‌లో సన్నిహితులు, సినీ ప్రముఖుల కోసం గ్రాండ్‌ రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

The post వెంకీ కూతురి పెళ్లి వేడుకల్లో సల్మాన్‌. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2TRW9d7

No comments:

Post a Comment