ప్రముఖ హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్‌లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుం వైరల్ అవుతోంది. సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ గతంలో ‘మదగజరాజా’, ‘ఆంబల’ చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో మలయాళం యాక్టర్ ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. కాగా ఫైట్ సీన్లను ఎలాంటి డూప్ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్‌కు అలవాటే. గతంలోనూ ’తుప్పరివాలన్’ సినిమా షూటింగ్‌లోనూ ఈ యువహీరో గాయపడిన విషయం తెలిసిందే.
ఇక విశాల్ ‘అయోగ్య’ చిత్రం మే 10న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి ఇది రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా, ఆయన జోడీగా రాశీ ఖన్నా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించినా చివరికి మే నెలకు వాయిదా పడింది. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం.
The post హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు, అసలు ఏమైందో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2UeddJF

No comments:
Post a Comment