అధిక బరువు త్వరగా తగ్గాలంటే.. నిత్యం గోరు వెచ్చని నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. అయితే వేడి నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గడమే కాదు, జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్ ఉండదు. అజీర్తితో బాధపడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే గోరు వెచ్చని నీటిని రోజు మొత్తంలోనే కాదు, నిద్రకు ఉపక్రమించే ముందు కూడా తాగాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిద్రించే ముందు గోరు వెచ్చని నీటిని తాగితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయి. మానసిక ఆందోళన తొలగిపోతుంది. నిద్ర చక్కగా పడుతుంది.
2. శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
3. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.
4. అధిక బరువు త్వరగా తగ్గుతారు. అజీర్తి సమస్య పోతుంది.
The post నిద్రించేముందు గోరు వెచ్చని నీటిని తాగితే..? ఎలా ఉంటుందో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HxSSZY
No comments:
Post a Comment