etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, September 14, 2019

గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే, అవేంటో తెలుసుకోండి.

గుండె జబ్బుకు ఆడ, మగ భేదా లు లేవు. ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది. గుండెపోటు కు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చమట పట్టడం, వికారంగా ఉండ డం వంటి లక్షణాలు స్త్రీపురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలిసింది.పైగా, మహిళల్లో సాధారణంగా అందరిలో కనపడే గుండెపోటు లక్షణాలతోపాటు, గొంతు, దవడ, మెడలోనూ అసౌకర్యం క లుగుతుందని తేలింది. తమకు గుండెపోటు వచ్చే అవకాశం త క్కువని భావించడం వలన మహిళలు ఆ జబ్బుకు చికిత్స ఆలస్యం గా మొదలెడతారని, దాంతో ప్ర మాదం మరింత పెరుగుతుంది.

1. జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా, అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి. దీంతోపాటు ద‌గ్గు కూడా ఎక్కువ‌గా వ‌స్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.
2. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాస ఆడ‌క‌పోవ‌డం. గాలి పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.
3. ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అవుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కూడ‌దు. వైద్యున్ని సంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే త‌గిన చికిత్స చేయించుకోవాలి.
4. మ‌త్తు మ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా, చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.
5.విప‌రీతంగా అల‌సిపోవ‌డం, ఒళ్లంతా నొప్పులుగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ క‌నిపిస్తుంటే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా ప‌నిచేస్తాయి.
6.ఎల్ల‌ప్పుడూ వికారంగా తిప్పిన‌ట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా, క‌డుపు నొప్పి వ‌స్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలుగానే భావించాలి.
7. కంటి చివ‌ర్ల‌లో కురుపుల వంటివి వ‌స్తే వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయి ఉండ‌వ‌చ్చు.
8.కాళ్లు, పాదాలు, మ‌డిమ‌లు అన్నీ ఉబ్బిపోయి క‌నిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచ‌న‌లుగా భావించాలి.
9. శ‌రీరం పై భాగం నుంచి ఎడ‌మ చేతి కిందిగా నొప్పి వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి. అంతే కాదు ఒక్కోసారి ద‌వ‌డ‌ల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించ‌వ‌చ్చు.
10. గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉంటే గుండె కొట్టుకోవ‌డం కూడా ఎప్పటిలాగా ఉండదు. కాబ‌ట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్‌ను కూడా గ‌మ‌నిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధార‌ణ బీట్ క‌నిపిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి. నిర్లక్షం చేసిన ప్రతీసారి మరణానికి ఒక్కోఅడుగు దగ్గర అవుతున్నట్టే.

The post గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే, అవేంటో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2LTXiKe

No comments:

Post a Comment