వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు సీబీఐ విచారణ గాని, మరేదైనా స్వతంత్ర సంస్థ విచారణ గాని చేపట్టాలని కోరితే స్వాగతిస్తామని శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. దురుద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం వివేకానందరెడ్డి ఆయన ఇంట్లో హత్యకు గురైన విషయంపై కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పలు ఆరోపణలు చేశారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం సతీష్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
మాజీ మంత్రిగా, ఎంపీగా పనిచేసిన నాయకుడు మృతిచెందాడని టీడీపీ నాయకులందరం కలిసి భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్లాలని చర్చించుకుంటుండగా రవీంద్రనాథరెడ్డి కుట్రపూరిత ఆరోపణలు చేయడం వలనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు. పులివెందుల్లో హత్యారాజకీయాలు ఎవరు చేస్తారో ప్రజలందరికి తెలిసిందేనన్నారు. కుటుంబంలో అంతర్గత సమస్యలు ఉన్నాయని, దాని వలనే వివేకా మృతిచెంది ఉంటాడని పులివెందుల ప్రజలు వివేకా హత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. డీజీపీని విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. చనిపోయిన వెంటనే ఏమాత్రం తెలుసుకోకుండా చంద్రబాబునాయుడు, లోకేష్, సతీష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి హత్య చేయించారని వైసీపీ నేత చెప్పడం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్నారు. రాజారెడ్డి హత్య కేసులోను, వేల్పుల ఘటనలోను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆయన ఆరోపించారు.
నేర చరిత్ర, హత్యారాజకీయాలు చేయడం వైసీపీ నాయకులకే చెల్లుతుందని, దానిని మళ్లీ ప్రత్యర్థులపై రుద్దడం పరిపాటిగా మారిందన్నారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ వివేకా మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని, తప్పు తేలితే నిరూపించి నడిరోడ్డుమీద కాల్చినా సమ్మతమేనని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. తప్పుచేసిన దోషులు ఎవరినైనా కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
The post ‘వివేకా హత్యకు.. నాకేం సంబంధం లేదు.. నా తప్పుందని తేలితే నడిరోడ్డు మీద కాల్చండి’ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2u9NRxW


No comments:
Post a Comment