ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో మునిగిపోగా.. కేఏ పాల్ మాత్రం తన విచిత్రమైన చేష్టలతో వార్తల్లో నిలుస్తున్నారు. తన వాహనంలో ఎక్కడికో ప్రయాణిస్తున్నటువంటి పాల్, ముందు సీట్లో కూర్చొని బాక్సింగ్ ఆడుతున్నట్లు, పక్క వారిని పడగొడుతున్నట్లు కొన్ని విచిత్రమైన చేష్టలు చేస్తూ కనబడ్డారు. ఆ సంఘటనను ఎవరో వీడియో తీసి పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఆర్జీవీ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘ప్రపంచ దిగ్గజ బాక్సర్.. మరో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌ను మట్టికరిపించిన ఈవాండర్ హోలీఫీల్డ్‌కు కేఏ పాలే బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చాడని ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా’ అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ హల్‌చల్ చేస్తుండగా.. కారులోని కేఏ పాల్ బాక్సింగ్ నవ్వులు పూయిస్తోంది.
The post పాల్ పంచ్‌లపై వర్మ తనదైన శైలిలో సెటైర్! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HOYtuf
No comments:
Post a Comment