ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన సహృదయతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో ఓ రైతు పెట్టిన వీడియో పోస్ట్‌కు స్పందించి ఏకంగా సదరు రైతుతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ను ఆ రైతు వద్దకు పంపించి వివరాలు ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుతో సీఎం కేసీఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ రికార్డుల సమస్యను పరిష్కరించడంతో పాటు రైతు బంధు, రైతు బీమా పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు భూముల సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు అమలుచేశారు. సదుద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కొందరు అధికారులు పక్కదారి పట్టించారు. ఇప్పటి వరకు చాలా మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదు. వచ్చినా అందులో తప్పులు ఉన్నాయి. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం దొరకడం లేదు. మంచిర్యాల జిల్లాకు చెందిన యువరైతు శరత్ కు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఐతే, అతను అందరిలా బాధపడడంతోనే ఆగిపోకుండా సమస్య పరిష్కారంపై దిశగా ఆలోచించాడు. ఆ ప్రయత్నమే అతని సమస్య సీఎం కేసీఆర్‌కు చేరేలా చేసింది. కేసీఆర్ కూడా వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించారు.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం అందుగులపల్లికి చెందిన రైతు శరత్‌కు సొంతూరులో కొంత పొలం ఉంది. ఐతే అందులో 7 ఎకరాలు పట్టాదార్ పాసుపుస్తకంలో నమోదుకాలేదు. ఆ భూమిని వేరొకరి పేరు మీద రెవెన్యూ అధికారులు పట్టాచేశారు. అందుకోసం భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. ఈ అన్యాయంపై శరత్ ఎన్నోసార్లు అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. దిక్కుతోచని స్థితిలో తన ఆవేదనను వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చివరకు కేసీఆర్ వరకు వెళ్లడంతో ఆయనే స్వయంగా శరత్‌కు ఫోన్‌చేసి సమస్యను తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్..అనంతరం మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరితో మాట్లాడారు.
The post సీఎం గుండెను తాకిన పేదరైతు ఆక్రందన, వైరల్‌గా మారడంతో సీఎం దృష్టికి తీసుకెళ్లిన….! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Ouq853
No comments:
Post a Comment