etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 22, 2019

పబ్‌జీ గేమ్‌ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు, అతని మరణంతో ఇప్పుడావీడియో వైరల్‌గా మారింది.

పబ్‌జీ గేమ్‌ పద్మ వ్యూహానికి మరో యువకుడు బలయ్యాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్‌ అనే 20 ఏళ్ల యువకుడు పబ్‌జీ గేమ్‌ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. టైంపాస్‌గా ఆడటం ప్రారంభించిన సాగర్‌కు ఈ గేమ్‌ వ్యసనంలా మారింది. గత 45 రోజులుగా పదేపదే ఈ గేమ్‌ ఆడటంతో అతని మెడనరాలు పట్టేసి ఆరోగ్యం విషమించింది. దీంతో​ కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. గత 5 రోజులుగా వైద్యులు సాగర్‌కు చికిత్స అందించగా.. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో గురువారం తుదిశ్వాస విడిచాడు. ఇక పబ్‌జీ గేమ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాగర్‌ను చూపిస్తూ.. అతని స్నేహితులు ఓ అవేర్‌నెస్‌ వీడియోను కూడా రూపొందించారు.

పబ్‌జీ గేమ్‌ ఆడటం ఎంత ప్రమాదకరమో సాగర్‌ పరిస్థితి చూసి తెలుసుకోండని ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పబ్‌జీ మహమ్మారికి యువత బానిస అవుతోంది. ఈ గేమ్‌ వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రహారాలు మాని అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా.. చదువు, చేసే పనిపై శ్రద్ద చూపించలేకపోతున్నారు. ఓ స్టూడెంట్ పరీక్షలో ఎకనామిక్స్ సూత్రాలకు బదులు పబ్ జీ వ్యాసం రాసిన విషయం తెలిసిందే. తాను గేమ్‌ ఆడటం మానేసినా.. దానికి సంబంధించిన చిత్రాలు వదలడం లేదని, పబ్‌జీ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థమైందని ఆ యువకుడు తెలిపాడు. యువతకు వ్యసనంగా మారిన ఈ గేమ్‌ను నిషేంధించాలనే డిమాండ్‌ అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

The post పబ్‌జీ గేమ్‌ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు, అతని మరణంతో ఇప్పుడావీడియో వైరల్‌గా మారింది. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2Tp71Kn

No comments:

Post a Comment