ఉన్నట్టుండి అకస్మాత్తుగా కంటి చూపులో తేడా వస్తుంది. అరె నిన్న మొన్నటి వరకు బాగానే ఉందే? సడెన్ గా ఎందుకిలా ఐంది అంటూ ఉండడం వింటూనే ఉంటాం.. మరికొంతమంది అయితే తలనొప్పిని నిర్లక్ష్యం చేసి దృష్టిలోపాలను కొనితెచ్చుకుంటుంటారు. కళ్లను నిర్లక్ష్యం చేసేవాళ్లు కొందరైతే, కళ్లజోడు పెట్టుకోవడానికి బద్దకించి సమస్యలు కొని తెచ్చుకునే వారు మరికొందరు. కళ్లజోడు పెట్టుకోకపోవడం వల్ల సైటు పెరిగిపోయి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిసినా పట్టించుకోరు. కళ్లు సలుపుతున్నా, నీరు కారుతున్నా అదే తగ్గుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు ప్రమాదంలో పడుతుంది. కంటి చూపులో తేడా వచ్చిందని గుర్తించేందుకు ఈ విధంగా పరీక్షించుకోవాలి..
కళ్లు తరచుగా దురద పెడుతుండటం. కనుకొలకుల్లో నుంచి తెల్లగా ఊసులు అధికంగా వస్తుండటం. కళ్లలో నుంచి నీరు కారడం, కళ్లు మంటగా ఉండటం, పత్రిక చదివేటప్పుడు దాన్ని 18 అంగుళాల కన్నా ఎక్కువ దూరంలో ఉంచి చదవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు విధిగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కంటి సమస్యకు కళ్లజోడు సరిపోదులే అని భావించరాదు. టీవీ చూసినా, కంప్యూటర్ ముందు కూర్చున్నా తలనొప్పిగా ఉండటం, సౌకర్యంగా కనిపించడానికి టీవీకి చాలా దగ్గరగా కూర్చోవడం వంటివి చేయరాదు. రెండు కళ్లతో సమానంగా చూడలేక పోవడం, రంగులను గుర్తించడంలో ఇబ్బంది పడటం, కళ్లు తిరిగినట్టుగా ఉండటం, కళ్ల ముందు కాంతి వలయాలు కనిపించడం, కాంతి తీవ్రతను కళ్లు తట్టుకోలేక పోవడం కంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తు. అదేపనిగా ఇంటర్నెట్ చూడటం వంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.
The post మీరు కంటి చూపుతో చంపెయ్య గలరా.. తెలుసుకోండిలా..? appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/eyes-check-increase-ones/
No comments:
Post a Comment