ఒకప్పుడు ఉలవలు ఉడకబెట్టి పశువులకు దాణాగా పెట్టేవారు. ఇప్పుడదే ఉలవలు మనుషులక్కూడా మంచివని చెబుతున్నారు. ఇక పెళ్లిళ్లు, పేరంటాల్లో అయితే అదొక కాస్ట్‌లీ ఫుడ్డయి కూర్చుంది. ఉలవచారుతో పాటు మీగడ లేదా వెన్న వేసి వడ్డిస్తూ తమ దర్పాన్ని చాటుకుంటున్నారు పెళ్లి వారు. ఉలవల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో ఉలవలతో చేసిన కషాయాన్ని తీసుకుంటే దాని తాలూకూ వచ్చే నొప్పి నుంచి ఉపవమనం కలుగుతుంది. అలాగే కొందరికి ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటాయి. అలాంటి వారికి కూడా ఉలవల కషాయం తాగితే తగ్గిపోతాయి.
కంటి సమస్యలకు, మధుమేహంతో బాధపడేవారికి ఉలవల కషాయం ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యలకు ఉలవలతో తయారు చేసిన ఆహార పదార్థాలు మంచివి. ఉలవల్లో క్యాల్షియం అధికంగా ఉండడంతో ఎదిగే పిల్లలకు అందించడం ఎంతైనా అవసరం. ఉలవల్లో ఉండే ఫైబర్ బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించి రక్తపోటు రాకుండా చేస్తుంది.అధిక బరువుతో బాధపడేవారు ఉలవలను, కొత్త బియ్యాన్ని కలిపి జావ తయారు చేసుకోవాలి. ఈ జావను రోజూ పరగడుపున తాగితే ఒంట్లోని కొవ్వంతా కరిగి బరువు తగ్గుతారు.
ఈ జావ మగవారికి కూడా ఎంతో ఉపయోగం. శృంగార సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఈ రెండింటి పౌడర్‌ని రోజూ రాత్రి పూట పాలల్లో కలిపి కూడా తాగవచ్చు.బాడీ పెయిన్స్‌తో బాధపడేవారు ఉలవలను తీసుకుని బాండీలో వేయించుకోవాలి. వేడిగా ఉన్న వాటిని తీసి ఓ పల్చటి బట్టలో కట్టి నొప్పులు ఉన్న చోట కాపడం పెడితే ఉపశమనం ఉంటుంది.కొందరికి మూత్ర సంబంధిత వ్యాధులు బాధపెడుతుంటాయి. యూరిన్‌కి వెళుతున్నప్పుడు నొప్పిగా, మంటగా ఉంటుంది. అలాంటి వారు కొబ్బరి నీళ్లలో ఉలవలతో చేసిన పౌడర్ ఒక స్పూన్ కలుపుకుని తాగితే రిలీఫ్ వస్తుంది. బాధ మరీ వేధిస్తుంటే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
The post ఉలవలతో ఉపయోగాలు.. మహిళల నెలసరి సమస్యలతోపాటు మగవారికీ….! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FkU8Mx


No comments:
Post a Comment