సూపర్ స్టార్ మహేష్‌బాబు ముద్దుల తనయ సితారా తన డాన్స్‌తో అదరగొట్టింది. తమ నివాసంలోని జిమ్‌లో బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకుంది. తన గారాలపట్టి చిన్ని చిన్ని స్టెప్పులకు తడిసిముద్దయిన మహేష్ ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘వాట్ ఎ టాలెంట్’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. సితారా డాన్స్ వీడియో వైరల్ అయింది. ఇదిలాఉండగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా ‘మహర్షి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్‌గా అలరించనుంది.
The post సితారా టాలెంట్‌ను మెచ్చుకున్న మహేష్‌బాబు, సితారా డాన్స్ వీడియో వైరల్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2TVWWZQ
No comments:
Post a Comment