etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, March 17, 2019

మాస్‌.. రొమాన్స్‌ : డియర్‌ కామ్రేడ్, దుమ్మురేపుతున్న టీజర్‌.

టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదిగిన విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. విజయ్‌ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ జోడి అనిపించుకున్న విజయ్‌, రష్మికలు మరోసారి మ్యాజిక్‌ చేయటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్ట్‌ ఇన్‌ ప్రభాకరన్‌ సంగీతమందిస్తున్నారు.

The post మాస్‌.. రొమాన్స్‌ : డియర్‌ కామ్రేడ్, దుమ్మురేపుతున్న టీజర్‌. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2T8obfb

No comments:

Post a Comment