etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, March 25, 2019

భోజనం చేసేప్పుడు నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా?!

ఈ అనుమానం మీకు ఇప్పటికి చాలాసార్లు వచ్చి ఉండాలే.. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. కొందరేమో భోజం చేస్తుండగా నీళ్ళు తాగకూడదు అని అంటారు. అలా తాగితే అది విషంతో సమానమని హెచ్చరిస్తుంటారు. మరికొందరేమో నీళ్ళు తాగకపోతే గొంతులో ముద్ద కడుపు దాకా చేరేదెలా అని ప్రశ్నిస్తుంటారు. ఇక భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగాకూడదు అని వాదించేవారు గుడ్డిగా, తాగకూడదు అని చెబుతారు. కాని, ఎందుకు తాగకూడదో సరిగ్గా చెప్పలేకపోవడం వల్లే వారు చెప్పేది పక్కనపెట్టేస్తారు జనాలు. ఇంతకూ భోజనం చేస్తుండగా నీళ్ళు తాగొచ్చా? తాగకూడదా? మీరేమనుకుంటున్నారు? సమాధానం కోసం కింద చూడండి..

* మన కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ ఆసిడ్ తిన్న తిండిని బ్రేక్ డవున్ చేస్తుంది. దాంతో మన శరీరం పదార్థాలను జీర్ణం చేసుకుంటుంది. అంటే, ఈ ఆసిడ్ లేకపోతే మన జీర్ణక్రియ స్తంభించినట్టే. తినే సమయంలో నీళ్ళు తాగడం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ డైల్యూట్ అవుతుందని, దాంతో జీర్ణక్రియ నేమ్మదిస్తుందని, తిన్న తిండి సరిగా బ్రేక్ డవున్ కాదని చాలామంది పరిశోధకులు చెబుతారు. కడుపు ఉబ్బరం కూడా తినే సమయంలో నీళ్ళు తాగడం వల్లే అని అంటారు.
* మరోవైపు కొంతమంది డాక్టర్ల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. కడుపులో సహజంగా ఉండే ఆసిడ్స్ తో పాటు నీళ్ళు కూడా ఆహారాన్ని బ్రేక్ డవున్ చేయడానికే ఉపయోగపడతాయి. కాబట్టి తినేటప్పుడు నీళ్ళు తాగడంలో తప్పు లేదు అని అంటున్నారు.
* కాబట్టి ఈ విషయం మీద మెడికల్ ప్రపంచలోనే ఓకే కామన్ అభిప్రాయం లేదు. మరి మనలాంటి సామాన్యులు ఏం చేయాలి? ఎంతైనా తింటున్నప్పుడు గొంతులో ఏదైనా తట్టుకోవడం రోజూ జరిగే పనే.. కాబట్టి గ్లాసులో నీళ్ళు దగ్గర ఉండాల్సిందే. కాని అతిగా తాగొద్దు. ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గ్లాస్ దగ్గరపెట్టుకోండి. భోజనానికి ఓ అరగంట ముందే నీళ్ళు తాగితే బెటర్ అని మరి కొందరు పరిశోధకులు సూచించారు.

The post భోజనం చేసేప్పుడు నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా?! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2FnbKqU

No comments:

Post a Comment