కొబ్బరినీళ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లను చాలా మంది వేసవిలో తాగేందుకే ఇష్టపడుతుంటారు. నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని ఏ కాలంలోనైనా తాగవచ్చు. కొబ్బరినీళ్లను తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అయితే నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ పరగడుపున కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు బయటకు వెళ్లిపోతాయి.
2. మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. శరీరానికి కొత్త శక్తి వస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉండే మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
3. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది. డీహైడ్రేషన్ బారిన పడే వారు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే మంచిది.
4. కొబ్బరినీళ్లు కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి. నేత్ర సమస్యలను పోగొడతాయి.
The post రోజూ పరగడుపునే కొబ్బరినీళ్లను తాగితే..? ఏం జరుగుంతుందో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HmfnRz
No comments:
Post a Comment