టీనేజీలో అబ్బాయిల కంటిమీద కునుకు లేకుండా పోయిందంటే అందుకు కారణం అమ్మాయిలేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మగవాళ్ల చూపును బట్టి వాళ్ళు తమనుంచి ఏం ఆశిస్తున్నారో, తమతో ఎటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నారో మగువలు ఇట్టే పసిగట్టేస్తారట. ఈ ఆసక్తికర అంశంపై పరిశోధకులు.. అమ్మాయిల గురించి మనసులో ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని యువకులను అడిగి తెల్సుకున్నారట. పరిశోధనలో పాల్గొన్న అబ్బాయిల్లో సగం మంది వెలిబుచ్చిన అభిప్రాయాలు దాదాపు దగ్గరగా ఉన్నాయట. పరిశోధకులు ముందుగా కొందరు అమ్మాయిల ఫోటోలను యువకులకు చూపించారు. ఆ అమ్మాయిల ఫొటోలకి ప్రీ కవర్డ్ పేపర్ అతికించారు. అయితే అన్ని శరీర భాగాలు అనేవి కనిపించట్లేదు. ఒక పార్ట్ మాకు కనిపించేలా చూపెట్టండని యువకులు అడిగారట. ఆడవాళ్ల ఆకర్షణీయమైన శరీర భాగాల వరకే ఇష్టపడడం కనిపించిందట. ఆ తర్వాత వారితో రిలేషన్ షిప్ ను కొనసాగించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదట.
అబ్బాయిలు చాలా వరకు అమ్మాయి అందంగా ఉంటే చాలు అనుకుంటారు. కొంతమంది అబ్బాయిలు మాత్రం ఫామిలీ జీవితం కొనసాగించడానికి మక్కువ చూపుతారు. అమ్మాయి శరీరాకృతి బాగుంటే అబ్బాయిల్లో చాలా మంది వారిపై మక్కువ చూపుతారు. సైకాలజిస్టులు చెప్పిన వివరాలు ప్రకారం.. అమ్మాయిని ఓ అబ్బాయి కలిసినప్పుడు ఆమె శరీరం గురించి వర్ణించడానికే ప్రధాన్యం ఇస్తాడు. ఇలాంటి అబ్బాయిలు అప్పటి సుఖం కోసమే అలా ఉంటారని, అయితే పొరపాటున అమ్మాయిలు వారికి ఎటాచ్ అయినా ఎక్కువ రోజులు కలసి ఉండరని పేర్కొన్నారు. అంటే మోజు తీరిపోయి మొహం మొత్తిపోయిన తర్వాత హ్యాండ్ ఇచ్చేస్తారన్నమాట. అయితే పరిశోధకులు కనిపెట్టిన ఓ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇలాంటివి అబ్బాయిల కళ్ళలోకి చూసి అమ్మాయిలు చాలా తేలిగ్గా పసిగట్టేస్తారట.
The post ఆడవాళ్ల చూపును బట్టి మీ మీద ఇష్టం ఉందో లేదో ఇలా కనిపెట్టొచ్చట!! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2F4LgKO
No comments:
Post a Comment