ఏ టైమ్ లో ఏం చేయలో కూడా విచక్షణ కోల్పోతున్నారు కొందరు చదువుకున్న ప్రబుద్ధులు. సెల్ఫీ మోజులో పడి పేషెంట్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొందరు డాక్టర్లు. ఒక వైపు మహిళ ప్రసవ వేదనతో బాధ పడుతుంటే బాధ్యత మరచిన డాక్టర్లు సెల్ఫీ తీసుకుంటూ.. ఆ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం ఒడిషాలో చోటు చేసుకుంది. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ తీసిన ఓ సెల్ఫీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కోరాపుట్ జిల్లా ఆసుప్రతిలో జరిగిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఓ గర్భిణీ మహిళకు డాక్టర్ల బృందం ఆపరేషన్ చేస్తున్న సమయంలో మరో డాక్టర్ తన మొబైల్‌తో సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ డాక్టర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పలు విమర్శలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సూపరింటెండెంట్‌ను కోరారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
The post ప్రెగ్నెంట్ మహిళకు ఆపరేషన్ చేస్తూ.. ఈ డాక్టర్ ఏం చేస్తుందో చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2UCsqkU
No comments:
Post a Comment