యువతను మానసిక రోగులుగా మార్చేస్తూ.. ఆత్మహత్యలకు పాల్పడేందుకు కారణమవుతున్న పబ్‌జీ గేమ్‌ను నిషేధించాలనే డిమాండ్లు ఓవైపు ఊపందుకుంటుంటే.. మరోవైపు కొందరు వ్యక్తులు ఈ గేమ్ ఆధారంగా ‘సోలో పబ్‌జీ టోర్నమెంట్లు’ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో అలాంటి టోర్నమెంట్ల పేరుతో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. నిర్వాహకులు ఆసక్తిగల వారిని గుర్తించి వారికి ఆన్‌లైన్‌లో మెసేజ్‌లు పంపి పబ్‌జీ ఆడేందుకు ఆహ్వానిస్తున్నారు. పేటీఎం ద్వారా రూ.30 చెల్లించిన వారికి వాట్సా్‌పలో లింక్‌ను పంపుతున్నారు. ఆ లింక్‌ను ఉపయోగించి నిర్వాహకులు చెప్పిన సమయంలో గేమ్‌లో పాల్గొనవచ్చు. ఇది పూర్తిగా నమ్మదగినదేనని, ఇందులో ఎలాంటి మోసం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ నిర్వాహకులు ఇప్పటికే చాలా టోర్నమెంట్‌లు నిర్వహించారని, ఈనెల 23న టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలియడంతో ఫిర్యాదు చేశామని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) జనరల్ సెక్రటరీ కేఎస్ ప్రదీప్ తెలిపారు. ఇదే కాకుండా ఏప్రిల్ 28న మరో పబ్‌జీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు. యువతను టోర్నమెంట్ల బారి నుంచి కాపాడాలంటూ ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) నాయకులు ఆదివారం సైబర్ క్రైం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ గేమ్‌ను గుజరాత్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు నిషేధించాయని, తెలంగాణలో కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని పీవైఎల్ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఈ గేమ్ వల్ల యువత విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోందని, టోర్నమెంట్ల కారణంగా డబ్బులు కూడా పోగొట్టుకునే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని వారు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ప్రదీప్‌తోపాటు.. పీడీఎ్‌సయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి బోయిన్‌పల్లి రాము, పీవైఎల్ నాయకులు పడాల సృజన్, కళ్యాణ్, మాదాసు ఆంజనేయులు, రాకేశ్‌రెడ్డి, తనుగుల వంశీ, బూషణవేని సాయి తదితరులు ఉన్నారు. కాగా.. సోలో పబ్జీ గేమ్ పేరిట టోర్నమెంట్ నిర్వహిస్తున్న కొంత మంది యువకులు.. పేటీయంలో రూ.30 చొప్పున ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు.
The post హైదరాబాద్‌లో నయా దందా.. ఒకరిని చంపితే రూ. 10, చికెన్ డిన్నర్ కొడితే…..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2GpO1XL


No comments:
Post a Comment