వీడికి తిండీ తిప్పలు అక్కర్లేదు. 24 గంటలూ నిద్రపోమన్నా దున్నపోతులా నిద్రపోతుంటాడు. ఎదిగి వచ్చిన కొడుకు పనీ పాట లేకుండా తిని పడుకుంటే తండ్రి అనే మాటలు ఇలానే ఉంటాయి. అయితే అలా నిద్రపోయే వాళ్ల కోసమే వెతుకున్నామంటున్నారు నాసా పరిశోధకులు. ఉద్యోగమే నిద్ర పోవడం. హాయిగా రెండు నెలల పాటు బెడ్ మీద పడుకుని నిద్ర పోతుంటే వారి పరిశోధనలేవో వారు చేసుకుంటారట.
అందుకోసం నాసా మీకు రూ.13 లక్షలు చెల్లిస్తుంది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ECA)తో కలిసి నాసా సంస్థ ఆర్టిఫిషియల్ గ్రావిటీ (కృత్రిమ గురుత్వాకర్షణ) పై అధ్యయనం జరుపుతోంది. అంతరిక్ష వాతావరణంలో వ్యోమగాములకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు నాసా తొలిసారిగా ఈ ప్రయోగం చేయపడుతోంది. ఈ సందర్భంగా 24 నుంచి 55 ఏళ్ల వయస్సు గల 12 మంది పురుషులు, 12 మంది మహిళలు అవసరమని నాసా పేర్కొంది. సెలక్ట్ అయిన వాళ్లంతా బెడ్ మీద పడుకుని నిద్రపోతే చాలు. అంతకు మించి ఏమీ చేయక్కరలేదు. ఇందుకు నాసా వారికి రూ.12.81 లక్షలు చెల్లిస్తుంది.
ఆర్టిఫిషియల్ గ్రావిటీ బెడ్ రెస్ట్ అనే ఈ స్టడీని కొలగ్నేలోని జర్మనీ ఏరో స్పేస్ సెంటర్ (డీఎల్‌ఆర్)లో నిర్వహిస్తారు. ఈ స్టడీ జరుగుతున్నప్పుడు వాలంటీర్లు ఎవరూ బయటకు వెళ్లకూడదు. కృత్రిమ గురుత్వాకర్షణలో వారి జ్ఞానశక్తి, కండరాల సామర్థ్యం, గుండె పనితీరు వంటి అంశాలను తెలుసుకుంటారు. ఈ అధ్యయనం ఫలవంతమైతే వ్యోమగాములు నివసించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో యాంటీ గ్రావిటీ పరికరాలను ఏర్పాటు చేయనుంది నాసా.
The post మీరు ఇక్కడికి వచ్చి నిద్రపోతే చాలు, మీకు ఏకంగా రూ.13 లక్షలు..ఇస్తారు, ఎందుకో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HROncW


No comments:
Post a Comment