etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, April 7, 2019

నా అదృష్టమేంటో గానీ ..నాకు 18 ఏళ్ళు వచ్చినప్పుడే ….?వాళ్లేం చేసినా… మనమే బాధ్యులం!

‘‘పంజాబ్‌లో మా కుటుంబానికి చాలా మంచి పేరుంది. మా వాళ్లు గొప్ప భూస్వామ్యులు. మొదటి నుంచీ రాజకీయాలకూ, మాకూ మంచి అనుబంధం ఉంది. మా నాన్నవైపు బంధువుల్లో సీనియర్‌ ఐఏయస్‌ ఆఫీసర్లున్నారు. మా తాత ఆర్మీలో పనిచేశారు. చుట్టుపక్కల ఊళ్లల్లో మాకు మంచి పలుకుబడి ఉంది. అందువల్ల మా ఇంటికి కొందరు మత్రులు వచ్చేవారు. కొందరు ఆఫీసర్లు వచ్చేవారు. ఎన్నికల సీజన్‌లో డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఎప్పుడూ ఆ మాటలే వినిపించేవి. వాళ్లు చెబుతున్న విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉండేవి. వీలైనంతవరకు అలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు నేను పక్కనే ఎక్కడో వింటూ నిలుచునేదాన్ని. కాబట్టి నాకు ఎన్నికల వాతావరణం కొత్త కాదు.

సరిగ్గా 18 ఏళ్లకే…

మనం ఓటు వేయాలంటే 18 ఏళ్లు రావాలి. కొన్నిసార్లు మనకు 18 ఏళ్లు వచ్చినా ఎన్నికలు రావాలి కదా! కానీ నా అదృష్టమేంటో సరిగ్గా నాకు 18 ఏళ్లు వచ్చిన ఏడాదే ఎన్నికలు జరిగాయి. ఉన్నట్టుండి పెద్దరికం వచ్చేసినట్టు అనిపించింది. ఎవరికి ఓటు వేయాలి? ఏ పార్టీలో ఏ అభ్యర్థులున్నారు.. అని చాలా చాలా ఆలోచించాను. తీరా పోలింగ్‌ బూత్‌కు వెళ్లి బటన్‌ ప్రెస్‌ చేసేటప్పుడు కూడా ‘నేను సరైన వ్యక్తినే ఎంపిక చేసుకుంటున్నానా’ అని మళ్లీ ఆలోచించా. ‘మరీ అంత ఆలోచించాలా?’ అని అనుకోకండి.. తప్పదు! తప్పుకూడా కాదు! నేనే కాదు… ఎవరైనా ఆలోచించాల్సిందే! ఎందుకంటే మనం వేసే ఒక ఓటు రాబోయే ఐదేళ్ల పాటు సమాజాన్ని పాలిస్తుంది. అందుకే ఓటు వేసేటప్పుడు మనసులో ఉత్సాహం, ఆత్రుతకన్నా ఆలోచన చాలా ముఖ్యం.

వాళ్లు మన ప్రతినిధులు

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. అలాగని వారికి నచ్చినవారికి వేయడం కాదు.. ఏ పార్టీకి వేస్తున్నాం. ఆ పార్టీ సిద్ధాంతాలేంటి? అభ్యర్థి గత చరిత్ర ఏంటి అని ఆరా తీయాలి. మనం ఎంపిక చేసుకునేది మన ప్రతినిధులను! అసెంబ్లీలోనూ, లోక్‌సభలోనూ మన తరఫున కూర్చుంటారు వాళ్లు. అక్కడ వాళ్లేం చేసినా, మనమే బాధ్యులం. ఎన్నో పనులు పక్కనపెట్టి, దేశ భవిష్యత్తు కోసం మనం వేసిన ఓటుకు, మన వేలి మీదకొచ్చిన సిరా చుక్కకు ఓ అర్థం ఉండాలి.

సమసమాజాన్ని కాంక్షించాలి!

పురుషులతో పోలిస్తే శారీరకంగా మహిళలకు కాస్త తక్కువ బలం ఉండొచ్చు. కానీ బుద్ధిబలంలో మాత్రం తక్కువ కాదు. ఇల్లయినా, రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి పథంలో సాగాలంటే స్త్రీల ప్రాతినిధ్యం తప్పనిసరి. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా పార్టీలు గుర్తించాయి. గెలుపొందిన మహిళలు కూడా తమ సత్తాను నిరూపించుకుంటున్నారు.

The post నా అదృష్టమేంటో గానీ ..నాకు 18 ఏళ్ళు వచ్చినప్పుడే ….?వాళ్లేం చేసినా… మనమే బాధ్యులం! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2KeqNsP

No comments:

Post a Comment