మిఠాయిని చూడగానే లొట్టలేస్తారు చాలా మంది. స్వీట్లు లేనిదే శుభకార్యం జరగదు. ఏ తీపి కబురు చెప్పినా దాంతోపాటే ఏదో ఒక స్వీటు జతవుతుంది. ఇలా స్వీట్లకు మార్కెట్ జోరుగా పెరుగుతోంది. సాధారణంగా శుభకార్యాల్లో లడ్డూ, దూద్‌పేడా, తదితరాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. కొంత మంది తాము పండగలకు వెళుతుంటే తమ వెంట ఓ మిఠాయి ప్యాకెట్‌ను తీసుకువెళుతుంటారు. మరికొంత మంది తమకు నచ్చిన వారికి మిఠాయి పంపుతుంటారు. సాధారణంగా కిలో మిఠాయి ధర రూ.వెయ్యిలోపే ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ సంపన్నులు వినియోగిస్తున్న మిఠాయి ధర మాత్రం ఇంతకు ఇరవై ముప్పై రెట్లు అధికంగా ఉంటోంది. సంపన్న వర్గాల కోసమే ప్రత్యేకంగా లడ్డూలు, దూద్‌పేడాలు తదితర స్వీట్లను తయారు చేస్తున్నారు కొంత మంది స్వీట్ల వ్యాపారులు. ఈ స్వీట్ల ప్రత్యేకత ఏమిటంటే వాటిలో మేలిమి బంగారం కూడా కలిసిపోవడం. అందుకే ఈ మిఠాయి ధర కిలోకు రూ.30,000 వరకు పలుకుతోందట. పూర్వకాలంలో రాజులు తాము తినే ఆహారంలో బంగారం పొడిని చల్లుకునే వారని చెబుతుంటారు. ఇప్పుడు సంపన్నులు బంగారంతో కూడిన స్వీట్లను తినడం మొదలుపెట్టారు.
వీటిని తింటున్న కస్టమర్లలో అంబానీలు కూడా ఉన్నారు. ఢిల్లీకి చెందిన ఓ స్వీట్ల తయారీ సంస్థ ఆకాష్ అంబానీ-శ్లోకా మెహతా పెళ్లి సందర్భంగా ఆహ్వానితుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 800 బాక్సుల స్వీట్లను పంపించిందట. ఇటాలియన్ పిస్తాచియో, తినే బంగారం కలిపిన స్వీట్ల ఖరీదు కిలోకు రూ.21 వేలట. ఢిల్లీకి చెందిన మరో స్వీట్ల కంపెనీ ఆరు రకాల లగ్జరీ స్వీట్లతో కూడిన బాక్సులను ఇషా అంబానీ-ఆనంద్ పిరామల్ పెళ్లి సందర్భంగా సరఫరా చేసిందట. ఈ నేపథ్యంలో ఇలాంటి స్వీట్లకు ప్రాచుర్యం మరింతగా పెరుగుతోందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. తమ హోదాను ఆర్థిక బలాన్ని తెలియజేసేందుకు కూడా ఇలాంటి మిఠాయీలు దోహదపడుతున్నాయంటున్నారు.
The post ఆకాష్ అంబానీ-శ్లోకా మెహతా పెళ్లిలో చర్చనీయాంశంగా మారిన స్వీట్లు, కిలో స్వీటు రూ. 30 వేలు.. దీని ప్రత్యేకత ఏమిటంటే..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2VejK7M
No comments:
Post a Comment