ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్. అదే ఫోన్ మీ వ్యక్తిగత సమచారాన్ని దొంగిలిస్తుంది. చైనా మొబైల్స్, యాప్స్ తో భారత భద్రతకు తీవ్రముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది భారతీయ నిఘా వర్గాల నుంచి… దీనిపై పారామిలటరీ దళాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ డీఐజీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. భారత్ లో చైనా మొబైల్స్ విపరీతంగా అమ్ముడవుతూ రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆ మొబైల్స్ లో చైనాకు చెందిన యాప్స్ ను విరివిగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా మొబైల్స్, యాప్స్ ద్వారా కీలక సమాచారం ఆ దేశానికి చేరే ప్రమాదం ఉందని ఆయన కేంద్ర, రాష్ట్ర పారామిలటరీ దళాలను హెచ్చరించినట్టు తెలుస్తోంది.
సుమారు 40 యాప్స్ తో ఈ ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆ 40 యాప్స్ వాడినవారి వ్యక్తిగత వివరాలు చైనా అధికారులకు అత్యంత సులువుగా చేరే అవకాశం ఉందని ఆ హెచ్చరికల్లో ఉన్నట్టు సమాచారం. ఈ యాప్స్ లో ప్రతిఒక్కరూ సాధారణంగా వినియోగించే యాప్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా మీ ఫోన్ లో ట్రూ కాలర్, షేరిట్, యూసీ బ్రౌజర్ వంటి యాప్స్ ఉన్నాయా… వాటితోనూ ప్రమదమేనని భారతీయ నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు..
ఆర్మీ, భద్రతా దళాల సిబ్బంది వాడే ఫోన్లలో ఈ యాప్‌లు ఉంటే.. దేశ భద్రతకే ప్రమాదమని పేర్కొన్నాయి.. ఈ నేపథ్యంలో ఆయా యాప్‌లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలని భారత సైన్యం, పారా మిలటరీ బలగాలకు కేంద్రహోంశాఖ అడ్వైజరీని జారీచేసింది. ఇలాంటి యాప్‌లు, ఫోన్లు వాడడం వలన సున్నితమైన సమాచారం చైనా చేతిలోకి వెళ్లే అకాశముందని పేర్కొంది. కేంద్రం తొలగించాలని పేర్కొన్న యాప్‌ల జాబితాలో యాంటీ వైరస్, వెబ్‌బ్రోజర్స్ వంటివి కూడా ఉన్నాయి. అంతేకాదు షామి ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా ఉండే ఎంఐ స్టోర్, ఎంఐ కమ్యూనిటీ యాప్‌లు సైతం ఉన్నాయి. ఏదైనా యాప్ అధికంగా డేటాను వినియోగిస్తుందంటే.. కచ్చితంగా అది అదనపు సమాచారాన్ని సేకరిస్తోందనే అర్ధమని సైబర్ భద్రతా నిపుణులు సందీప్ సేన్ గుప్తా అన్నారు. భారతీయ నిఘావర్గాలు చెబుతున్న ప్రకారం ప్రమాదకరమైన చైనా యాప్‌లు ఇవేనట….
వీబో, వి చాట్ , షేర్‌ఇట్ , ట్రూకాలర్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, ఎంఐ స్టోర్, ఎంఐ వీడియో కాల్, ఎంఐ కమ్యూనిటీ , క్లీన్‌మాస్టర్, 360 సెక్యూరిటీ, డియు రికార్డర్, డియు ప్రైవసీ, డియు బ్రౌజర్, డియు క్లీనర్, డియు బ్యాటరీ సేవర్, వైరస్ క్లీనర్ పర్‌ఫెక్ట్ కార్ప్ సీఎం బ్రౌజర్, బ్యూటీ ప్లస్, న్యూస్ డాగ్, వివా వీడియో-క్యూయూ వీడియో, యు క్యామ్ మేకప్, ఫొటో వండర్, ప్యారెలల్ స్పేస్, క్యాచి క్లీనర్, వాల్ట్‌హైడ్, వండర్ కెమెరా, సెల్ఫీ సిటీ, మెయిల్ మాస్టర్, వి సింక్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, బైడు ట్రాన్స్‌లేట్ , బైడు మ్యాప్, ఏపీయూఎస్ బ్రౌజర్ , క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ న్యూస్ ఫీడ్, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్, క్యూక్యూ లాంచర్.
క్విక్ పిక్ (QuickPic)…
ఇది ఓ ఫొటో గ్యాలరీ యాప్. దీన్ని చీతా మొబైల్స్ సంస్థ డెవలప్ చేస్తోంది. కాగా ఇటీవలి కాలంలో ఈ సంస్థ క్విక్ పిక్ యాప్ ద్వారా యూజర్ల ఫోన్లలో ఉన్న సమాచారాన్నంతా తన సర్వర్లకు చేరవేస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఈ యాప్‌ను ఫోన్‌లో ఉంచుకోవడం కన్నా తీసేయడమే బెటర్. లేదంటే మీ సమాచారమంతా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ (ES File Explorer)
ఈ యాప్ వల్ల బ్లోట్‌వేర్, యాడ్‌వేర్‌ల రూపంలో వైరస్‌లు ఆండ్రాయిడ్ ఫోన్లలోకి ప్రవేశిస్తున్నాయట. కాబట్టి ఈ యాప్ మీ ఫోన్‌లో ఉన్నా వెంటనే తీసేయండి.
యూసీ బ్రౌజర్ (UC Browser)
వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజర్‌గా ఈ యాప్ ఎంతో గుర్తింపు పొందింది. ఇంటర్నెట్‌ను వేగంగా బ్రౌజ్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. కాకపోతే అలా చేసే క్రమంలో ఇంటర్నెట్ స్పీడ్‌నంతా కంప్రెస్ చేస్తుంది. దీంతో ఇతర యాప్‌లకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఈ యాప్‌ను కూడా మీ డివైస్ నుంచి తీసేయండి.
క్లీన్ ఇట్ (CLEAN It)
డివైస్‌లో పేరుకుపోయిన జంక్ ఫైల్స్‌ను క్లీన్ చేసేందుకు దీన్ని వాడతారు. కానీ అలా క్లీన్ చేసే క్రమంలో ఈ యాప్ పెద్ద ఎత్తున బ్యాటరీని వాడుకుంటుంది. దీంతో బ్యాటరీ పవర్‌లో సమస్యలు వస్తాయి. కనుక ఈ యాప్ కూడా ఉండకూడదు.
మ్యూజిక్ ప్లేయర్ (Music Player)
ఈ యాప్ ఆండ్రాయిడ్ డివైస్‌లన్నింటిలోనూ డిఫాల్ట్‌గా వస్తోంది. దీన్ని వాడడం వల్ల డివైస్ బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది. అదే సమయంలో ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటే పెద్ద మొత్తంలో డేటాను వాడుతుంది. కాబట్టి ఈ యాప్‌ను తీసేయండి.
డ్యు బ్యాటరీ సేవర్ అండ్ ఫాస్ట్ చార్జ్ (DU battery saver & fast charge)
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎప్పటి కప్పుడు ఏదో ఒక అడ్వర్టయిజ్‌మెంట్ వస్తూ మిమ్మల్ని విసిగిస్తోందా? యాప్స్ వాటంతట అవే ఇన్‌స్టాల్ అవుతున్నాయా? అయితే అందుకు డ్యు బ్యాటరీ యాపే కారణం. ఆ యాప్‌ను వెంటనే తీసేస్తే పైన చెప్పిన సమస్య పోతుంది.
డాల్ఫిన్ బ్రౌజర్ (Dolphin browser)
ఆండ్రాయిడ్ డివైస్‌లను వాడుతున్న యూజర్లు ఈ యాప్‌ను గనక ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంతో యూజర్ సమాచారమంతా ఆ యాప్ సర్వర్లలోకి చేరిపోతుంది. అంతేకాదు, యూజర్ ఇంటర్నెట్‌లో దర్శించే సైట్ల వివరాలన్నీ ఆ యాప్ ఓనర్లకు అందుతాయి. కాబట్టి ఈ యాప్‌ను కూడా తీసిపారేయండి
The post ఈ లిస్టు లో ఉన్న ఏ ఒక్క యాప్ మీ మొబైల్ లో ఉన్న మీకు చాలా డేంజర్…వెంటనే డిలీట్ చెయ్యండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2DupvnJ
No comments:
Post a Comment