etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 13, 2019

ఇంగ్లీష్‌లో గడగడా మాట్లాడిన కూలీ.. నోరెళ్లబెట్టిన రిపోర్టర్.. వైరల్ వీడియో

సాధారణంగా కూలీ పని చేసుకునే వాళ్లకు మా.. అంటే ఎన్ని భాషలు వస్తాయి. ఒకటో రెండో మాట్లాడగలుగుతారు. తమ మాతృ భాష, ఇంకా హిందీ లేదా వేరే రాష్ట్రంలో సెటిల్ అయితే అక్కడి భాష మాట్లాడుతారు. కానీ.. బీహార్‌కు చెందిన ఈ కూలీ మాత్రం ఇంగ్లీష్‌లో గడగడలాడించాడు. అతడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే అతడిని ప్రశ్నలు అడిగిన రిపోర్టర్‌తో సహా.. అక్కడున్న వాళ్లు నోరెళ్లబెట్టారు. బీహార్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రజల నాడిని తెలుసుకునేందుకు హిందీ న్యూస్ చానెల్‌కు చెందిన సౌరబ్ త్రిపాఠీ అనే ఓ రిపోర్టర్ ఓ కూలీని ప్రశ్నించారు.

ఐ వాంట్ టూ వర్క్ అంటూ ఆ కూలీ ఇంగ్లీష్‌లో మాట్లాడేసరికి.. ఇంగ్లీష్ అంటూ రిపోర్టర్ అన్నారు. దీంతో ఆ కూలీ.. ఎస్.. వై నాట్ అంటూ ఇంగ్లీష్‌లో గడగడలాడించాడు. కూలీ పని చేసి బతుకుతున్న ఆ వ్యక్తి భగల్‌పూర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడట. అతడు ఇంగ్లీష్‌లో ఇందిరా గాంధీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వాన్ని పోల్చుతూ మాట్లాడాడు. ప్రస్తుతం మోదీనే బెస్ట్. ఆ సమయంలో ఇందిరా గాంధీ బెస్ట్.. అంటూ ఏమాత్రం గ్రామర్ తప్పులు లేకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడేసరికి అక్కడున్న వాళ్లంతా చప్పట్ల మోత మోగించారు. ఆ కూలీ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాదు.. నెటిజన్లు కూడా ఆ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

The post ఇంగ్లీష్‌లో గడగడా మాట్లాడిన కూలీ.. నోరెళ్లబెట్టిన రిపోర్టర్.. వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2P9SIJ4

No comments:

Post a Comment