మనీ ప్లాంట్… ఈ మొక్క గురించి అందరికీ తెలిసిందే. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే ధనం బాగా కలసి వస్తుందని, అంతా శుభమే కలుగుతుందని అందరూ నమ్ముతారు. దీంతో పాటు ఈ మొక్క వల్ల దాని చుట్టూ ఉన్న వాతావరణంలో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది ఇంట్లోని వారందరికీ చాలా శక్తిని, అదృష్టాన్ని ఇస్తుందని కూడా కొందరు నమ్ముతారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా, మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే దాన్ని ఉంచాలి. అప్పుడే మనకు తగిన ఫలితం లభిస్తుంది. ఇంతకీ అసలు మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశలో (ఉత్తరం-తూర్పు మధ్యన) ఉంచకూడదు. అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం కూడా బాగుండదు.
2. ఇంట్లో ఏదైనా కుండీలో లేదా ఓ బాటిల్‌లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్‌ను పెట్టాలి. దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
3. ఇంట్లో పశ్చిమ దిశలో మనీ ప్లాంట్‌ను పెట్టకూడదు. లేదంటే దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువగా వచ్చి విడిపోయేందుకు అవకాశం ఉంటుంది.
4. మనీ ప్లాంట్‌కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాలి. దీని వల్ల ఇంట్లో అంతటా పాజిటివ్ శక్తి నిండిపోతుంది.
5. ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేదంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.
6. ఇంట్లో ఆగ్నేయ దిశలో (తూర్పు- దక్షిణం మధ్య) మనీ ప్లాంట్‌ను ఉంచాలి. ఈ దిశ అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. ఈ క్రమంలో ఆ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచితే అదృష్టం బాగా కలసివస్తుంది. ధనం కూడా బాగా చేకూరుతుంది. ఇంట్లోని వారందరికీ శుభమే కలుగుతుంది.
The post ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటె పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.. బాగా ధనం, అదృష్టం కలసివస్తుంది కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Dre0NS


No comments:
Post a Comment