‘చెన్నై సూపర్ కింగ్స్ విజయ సూత్రం… ఓ పెద్ద రహస్యం. రిటైరయ్యే వరకూ అదేమిటో చెప్పను. ఒకవేళ నేను ఇప్పుడు వెల్లడిస్తే ఐపీఎల్ వేలంలో నన్నెవరూ కొనరు’ అని ఆ జట్టు కెప్టెన్ ధోనీ నవ్వుతూ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు 155 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన మహీ.. 97 విజయాలు అందించాడు. ధోనీ కెప్టెన్సీలో చైన్నై మూడుసార్లు (2018, 2011, 2010) ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఇంకా మహీ నాయకత్వంలో 2016, 2017 మినహా అన్ని సీజన్లలోనూ చెన్నై ప్లేఆ్‌ఫ్సకు చేరడం విశేషం. ‘అభిమానులతోపాటు ఫ్రాంచైజీ మద్దతు కూడా కీలకం. సహాయ సిబ్బంది మద్దతు అమోఘం. జట్టులో వాతావరణం ఆహ్లాదంగా ఉండడంలో వారి పాత్ర ఎంతో ఉంది. ఇవి తప్ప మా టీం గెలుపు సూత్రాలేంటన్నది నేను రిటైరయ్యే వరకూ ఏమీ చెప్పలేను’ అని 37 ఏళ్ల ధోనీ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 104.66 సగటు, 137.11 స్ట్రయిక్ రేట్‌తో మొత్తం 314 పరుగులతో చెన్నై జట్టులో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
The post నా దగ్గరున్న ఆ రహస్యం చెబితే నన్నెవరూ కొనరు : ధోని appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2IUBONv
No comments:
Post a Comment