వైసీపీ అధినేత జగన్ తనజెండా పాల్ లాక్కున్నాడని..ఆయన చంద్రబాబు పార్టనర్ అంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. మండలం లోని ముదునూరు, పెంటపాడు , దర్శిపర్రు, వల్లూరుపల్లి, రాచర్ల, అలంపురం, ప్రత్తిపాడు గ్రామాల్లో సోమవారం రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. 2008లో తాను పార్టీ పెట్టానని, జెండా కూడా అప్పుడే రిజిస్టర్ అయిందన్నారు. చేతకాక మా జెండాను కాఫీ కొట్టి మా మీదే జగన్ విమర్శలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మనవడికి 8 మంది సెక్యూరిటీ గార్డ్‌లు ఉంటున్నారన్నారు. నా ప్రాణాలకు హాని ఉన్నా కూడా తాను ప్రచారానికి వస్తున్నానని తనకు ఇద్దరు గన్‌మన్‌లను సెక్యూరిటీగా పంపించారన్నారు. నేను అధికారంలోకి వస్తే ఆంధ్రరాష్ట్రాన్ని అమెరికా చేసి చూపిస్తానన్నారు. సైకిల్ తుప్పు పట్టిందని.. ఫ్యాన్ గాలి రావడంలేదని.. గ్లాసు పగిలిపోయిందని తన హెలికాప్టర్ మాత్రం బాగా పనిచేస్తుందంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రజలు తనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు కానీ సైకిల్, ఫ్యాన్, గ్లాసులకు మాత్రం ఓటేయవద్దని.. లోకల్ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. రోడ్‌షో ఆద్యం తం నవ్వులతో కొనసాగింది.పర్యటన మొత్తం కూడా పాల్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. పాల్ కూడా అడిగిన వారందరికీ పోజు లిచ్చారు.
నేను వచ్చానని వైసీపీ జెండా పీకేశారు…
పెంటపాడు కాలేజ్ సెంటర్ వద్ద పాల్ ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వైసీపీ కార్యాలయంలో ఒక యువకుడు పాల్‌కు వైసీపీ జెండాను చూపించాడు.దీంతో పాల్ చూశారా నేను వచ్చానని వైసీపీ జెండా కూడా పీకేశారు.ఇటువంటి అద్భుతాలు చాలా జరుగుతాయంటూ చమత్కరించారు.
మన గుర్తు సైకిల్ కాదు.. హెలీకాఫ్టర్..
వల్లూరుపల్లిలో ఒక వృద్దుడు తనకు రైతు రుణమాఫీ కాలేదని చెప్పడంతో పాల్ తన వద్ద ఉన్న మైక్‌ను అతనికి ఇచ్చి మాట్లాడమన్నారు. తనకు రుణమాఫీ కాలేదని.. రుణమాఫీ చేస్తే నా ఓటు మీకే వేస్తానంటూ పాల్‌కు చెప్పాడు. దీంతో పాల్ తన గుర్తు ఏంటని అతన్ని ప్రశ్నించారు.. అతను వెంటనే సైకిల్ అని చెప్పడంతో అక్కడ అందరూ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారు. తరువాత మన గుర్తు హెలీకాప్టర్ అంటూ పాల్ ఆ వ్యక్తికి తెలిపారు.
The post ‘నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు కానీ సైకిల్, ఫ్యాన్, గ్లాసులకు మాత్రం ఓటేయవద్దు..’ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FPr1Cm
No comments:
Post a Comment