రాజకీయాలు దిగజారిపోయాయని, చెడిపోయిన రాజకీయాల్లో మార్పు రావాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం, కడప జిల్లా జమ్మలమడుగు, గుంటూరు నగరం, విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని పైపులరోడ్డు సెంటర్లలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతఎన్నికలను ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రతి అడుగులో మోసం కనిపిస్తోందన్నారు. సొంత కుటుంబాన్నే మోసం చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడంటే ఎలా నమ్మగలమని ప్రశ్నించారు. కుప్పం సహా ఎక్కడా అక్కచెల్లెళ్లకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని, ఇప్పుడు పసుపు-కుంకుమ పేరుతో సినిమా చూపిస్తున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీతో వడ్డీలు కూడా తీర్చలేరన్నారు.
చంద్రబాబు చేసే గిమ్మిక్కులకు మోసపోవద్దని, ఒక్క వారమాగితే తాను సీఎం అవుతానని చెప్పారు. తాను సీఎం అయ్యాక అక్కచెల్లెళ్ల బిడ్డలకు చదువు ఖర్చునంతా భరిస్తానని, పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లుగా చూసుకునే భాగ్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు క్రమబద్ధీకరణ కమిటీ వేస్తామని, ఈ కమిటీ సీఎం ఆధ్వర్యంలోనే పని చేస్తుందని చెప్పారు. వైఎ్‌సలా జీరో వడ్డీకి రుణాలివ్వడమేకాక, రైతులకు రూ.50 వేలు పెట్టుబడి కోసం ఇస్తానన్నారు. పింఛను రూ.3 వేలు చేస్తానన్నారు. 30 ఏళ్లుగా గెలిపించుకొస్తున్నా చంద్రబాబు కుప్పంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిని గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తానని, తద్వారా కుప్పం అభివృద్ధికి దోహదం చేస్తానని, పాలారు ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పారు. జమ్మలమడుగులో ఒకనాటి ఫ్యాక్షన్ కుటుంబాలు రాజకీయ స్వార్థం కోసం ఒక్కటయ్యాయన్నారు. రాజకీయ వ్యవస్థ చెడిపోయిందన్నారు. మార్పు తీసుకురావడం తనతోనే సాధ్యమన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే గండికోట ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందని, మిగిలిన 15 శాతం పూర్తి చేసేందుకు చంద్రబాబు వంద శాతం అంచనాలను పెంచి నామినేషన్ పద్ధతిలో తన బినామీకి పనులు అప్పగించారన్నారు. గండికోట బాధితులకు ముష్టివేస్తున్నట్లు రూ.6.75 లక్షలు పరిహారం ఇస్తున్నారని, తాను అధికారంలోకి వస్తే రూ.10 లక్షలు ఇస్తానని చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరుల అక్రమాల వల్ల టౌన్‌బ్యాంకు దివాలా తీసిందని, గండికోట ముంపువాసులకు అన్యాయం జరిగిందన్నారు. జమ్మలమడుగులో వైఎస్ హయాంలో దాల్మియా లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేశారన్నారు. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టినా వైఎస్ మరణానంతరం మూతపడిందన్నారు. తాను అధికారంలోకి వస్తే తిరిగి బ్రహ్మణి వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తానని, మూడేళ్లలో పరిశ్రమ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.11,400 కోట్లు చెల్లిస్తామని చెప్పారు.
రూ. 40 వేల ఆదాయం లోపు ఉన్న వాళ్ల వరకు యూనివర్సల్ హెల్త్‌కార్డు స్కీమ్ అమలులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామన్నారు. అర్బన్ హౌసింగ్‌లో రుణం మొత్తం మాఫీ చేస్తానన్నారు. విజయవాడలో అధికారపార్టీ ప్రజాప్రతినిధుల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఐపీఎస్ అధికారిపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా దాడి చేసినా సీఎంకు ఏమాత్రం పట్టలేదన్నారు. సమరయోధుల భూములు ఆక్రమించిన కేసులో బొండా భార్యపై సీఐడీ కేసు నమోదు చేసినా, ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
The post వారం ఆగితే నేనే ముఖ్యమంత్రి, కుప్పం అభ్యర్థికి మంత్రి పదవిస్తా : జగన్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Uj5tqT
No comments:
Post a Comment