తన స్నేహితుడు, గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ జితేంద్రగౌడుకు మైనార్టీలందరూ ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు నాగినీడు అభ్యర్థించారు. జితేంద్రగౌడుకు బాల్య స్నేహితుడైన నాగినీడు (మర్యాద రామన్న ఫేం) శుక్రవారం గుంతకల్లులో టీడీపీ తరపున విస్తృత ప్రచారం చేశారు. పోర్టర్స్‌లైన్ మసీదు, తిలక్‌నగర్‌లోని మసీదుల వద్ద ఓట్లను అభ్యర్థించారు. ముస్లింల టోపీ ధరించిన నాగినీడు అందరినీ ఆకట్టుకున్నారు. పలువురు మహిళలు టోపీ ధరించిన ఆయన్ను గుర్తించి మర్యాద రామన్న సినిమా నటుడంటూ చర్చించుకున్నారు. కరపత్రాలు అందజేస్తూ తన స్నేహితుడు జితేంద్రగౌడుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నాగినీడు ఓటర్లను కోరారు. జితేంద్ర గౌడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తోందన్నారు. తాను కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, తనకు మరో అవకాశాన్నిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఓటర్లను అభ్యర్థించారు.
అనుభవానికి ఓటెయ్యండి : నాగినీడు
ప్రతి పనికీ అనుభవమనేది అత్యంత ప్రాము ఖ్యమని, అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సమర్థ వంతంగా పరిపాలిస్తున్నందున ఆయనకే ఓటు వేయండని సినీ నటుడు నాగినీడు పేరొన్నారు. శుక్రవారం సాయంత్రం పాతగుంతకల్లులోని వా ల్మీకి సర్కిల్ వద్ద ఆయన రోడ్‌షోను నిర్వహించారు. వాల్మీకి విగ్రహానికి పూలమాలను వేసి అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏ చిన్న ఉద్యోగానికి వెళ్లినా అనుభవం గురించి అడుగుతారని, అటువంటిది ఇంత పెద్ద రాష్ట్రాన్ని, అందులోనూ అభివృద్ధి కార్యక్రమం మధ్యలో ఉన్న ఏపీని ఓ అనుభవజ్ఞుడే సక్రమంగా నడపగలడన్నది సుస్పష్టమన్నారు. జగన్ కూడా పరిపాలన చేయవచ్చేమోగాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు ఏమాత్రం జాగేర్పడకుండా ముందుకు సాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడే పెద్దదిక్కన్నారు.
తమిళనాడు లాంటి చిన్న రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలున్నాయని, చంద్రబాబు కష్టపడి హైద రాబాద్‌ను అభివృద్ధి చేస్తే అదికాస్తా మనకు దక్కకుండాపోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, చంద్రబాబు పరిపాలన లో పరిశ్రమలు వ్యవస్థాపితమై ఎన్నో ఉద్యోగాలు వస్తాయన్నారు. కనుక ప్రస్తుత తరుణంలో అనుభవం పుష్కలంగా ఉన్న చంద్రబాబు నాయు డినే ముఖ్యమంత్రిగా చేస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. కనుక ఈ విషయాన్ని గుర్తించి టీడీపీకి ఓటువేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కోడెల అపర్ణ, వైస్ చైర్మన్ ఆర్ శ్రీనాథ్‌గౌడు మాట్లాడుతూ రాష్ట్రాం అభివృద్ధి చెందాలంటే మరో ఆలోచన లేకుండా చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరముందన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు సంజీవ్‌కుమార్ గౌడు, జింకల జగన్నాథ్, చెల్లూరి నరసింహులు, కేశప్ప తదితరులు పాల్గొన్నారు.
The post మర్యాద రామన్నలో విలన్.. ఏపీ ఎన్నికల్లో ప్రచారం.. ఏ పార్టీకంటే..! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2WSU3qB
No comments:
Post a Comment