ప్రస్తుతం సోషల్ మీడియాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్కూల్‌కి వెళ్లే బుడతడి నుండి పండు ముసలి వరకు సోషల్ మీడియాలో సగం సమయం గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అభిమానులకి , సెలబ్రిటీలకి మధ్య వారదిలా సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా వలన అభిమానులు తమ ఫేవరేట్ స్టార్స్‌కి చాలా దగ్గరగా ఉంటున్నారు. సెలబ్రిటీలు అందరు దాదాపు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్స్ వాడుతున్నారు. అయితే బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ మాత్రం ఒక్క ఫేస్ బుక్ వేదికగా మాత్రమే అప్పుడప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. అభిమానుల డిమాండ్ వలన ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ఎకౌంట్ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. కనీసం ప్రొఫైల్ పిక్ కాని, ఒక్క పోస్ట్ కాని పెట్టలేదు. అయినప్పటికి అది ప్రభాస్ అఫీషియల్ ఎకౌంట్ అని తెలుసుకున్న నెటిజన్స్ ఆయనని ఫాలో కావడం మొదలు పెట్టారు.
దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ ప్రభాస్‌ని ఫాలో అవుతున్నారు. ఇక ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇస్తే సోషల్ మీడియా షేక్ కావలసిందే అని ఆయన అభిమానులు అంటున్నారు. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా ఈ ఏడాదే విడుదల కానుందని అంటున్నారు.
The post ఇన్‌స్టాగ్రామ్‌లో తుఫాను సృష్టిస్తున్న ప్రభాస్, ఎలానో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Kv748e

No comments:
Post a Comment