సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. గతంలో సైబర్ ముఠా సభ్యులు…. బ్యాంక్ ఖతాదారులకు పోన్ చేసి… తాము బ్యాంక్ నుంచి పోన్ చేస్తున్నామని… మీ దగ్గర ఉన్న కార్డు నంబర్ల వివరాలు, ఓటీపీ వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడుతుండేవారు. పాత పద్దతికి పుల్ స్టాప్ పెట్టి.. ఇప్పుడు ఏకంగా బ్యాంక్ లనే టార్గేట్ చేసుకుని వరుస సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జార్ఖాండ్, బెంగాల్ కేంద్రంగా వివిధ బ్యాంక్ ల ఖాతాదారుల వివరాలు గురించి బ్యాంకులకే పోన్ చేసి తెలుసుకుని ఈజీగా కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా అంతరాష్ట్ర సైబర్ క్రైం నేరగాళ్లకు చెక్ పెట్టారు సైబరాబాద్ పోలీసులు.
జార్ఖాండ్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన దుర్యోదన్ మండల్, సంజయ్, వీరెంద్ర కుమార్, ధనజయ్ ఇలా మొత్తం పది మంది ముఠాగా ఏర్పడి బ్యాంక్ ఖాతాదారులను టార్గేట్ చేశారు. మొదటగా ఈ ముఠా సభ్యులు… రెడ్ బస్, మోబైల్ వాలెట్, బుకింగ్ అప్లికేషన్ లను డౌన్ లోడ్ చేసుకుంటారు. ఈ అప్లికేషన్స్ లో ఏదైన బ్యాంక్ కార్డు నంబర్ కి సంబంధించి.. ఆరు నంబర్లు టైప్ చేసి తర్వాత ర్యామ్ డ్యామ్ గా కొన్ని నంబర్లను టైప్ చేస్తారు. కార్డు నంబర్లు మొత్తం క్లియర్ గా చూపించిన వాటిని నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకున్న వివిధ బ్యాంక్ కార్డు నంబర్లతో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సెంటర్ కి కాల్ చేసి ఆ కార్డు నంబర్ల వివరాలు, పిన్ నంబర్ల వివరాలు తెలుసుకుంటారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఏటీఎం కార్డును క్లోన్ చేసి… దేశంలోని వివిధ ఏటీఎంల ద్వారా ముఠా సభ్యులు… సుమారు 3 కోట్ల వరకు డబ్బులు డ్రా చేసినట్లు పోలీసులు గర్తించారు.
అయితే ఈ ముఠా సభ్యులు… వివిధ బ్యాంక్ లకు సంబంధించి… మూడు లక్షల వరకు కార్డు నంబర్లు సేకరించారు. కానీ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సెంటర్ కి కాల్ చేసి 3500 వరకు కార్డ్ పిన్ నంబర్లు తెలుసుకుని వరుస మోసాలకు పాల్పడిన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ పరిధిలోని ఓ బ్యాంక్ మేనేజర్ పిర్యాదుతో ఈ ముఠా గుట్టురట్టు అయ్యింది. ముఠా సభ్యులు… ఎక్కువగా ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకులనే టార్గేట్ చేసుకున్నారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ లో ఉన్న లోసుగులనే బేస్ చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ లో మార్పులు చేసుకోవాలని బ్యాంక్ లకు నోటీసులు జారీ చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. అలాగే రెడ్ బస్ అప్లికేషన్ తోపాటు మరికొన్ని అప్లికేషన్ తయారు చేసిన వాళ్లకు పబ్లిక్ వివరాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎవరైనా బ్యాంక్ అధికారులమని పోన్ చేసి అడిగితే.. బ్యాంక్ కార్డు వివరాలు కానీ ఏటీఎం కార్డు వివరాలు కానీ ఎవరికి షేర్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
The post వామ్మో …! రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు.. బ్యాంక్ ఖాతాదారులకు ఫోన్ చేసి….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2IFeK67


No comments:
Post a Comment