చిన్నప్పుడు వేలు నోట్లో పెట్టుకుని చీకడం.. పెద్దయ్యాక గోళ్లు కొరకడం.. అప్పుడంటే తెలియక.. ఇప్పుడు తెలిసి చేస్తుంటారు. నిజానికి గోళ్లు కొరికే అలవాటు ఒక మానసిక వ్యాధి లక్షణం. ఒత్తిడిలో ఉన్నవారే ఇలా ఎప్పుడూ గోళ్లు నోట్లో పెట్టుకుని కొరుకుతుంటారు అని మానసిక వ్యాధి నిపుణులు చెబుతున్నారు. న్యూజిలాండ్‌లో 5 నుంచి 32 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు వెయ్యి మందిపై పరిశోధనలు జరిపారు. గోళ్లు కొరికే అలవాటు కారణంగా జలుబు, జ్వరం, ఆస్తమా వ్యాధులు వచ్చినట్లు గుర్తించారు. పిల్లల వయసు 5,7,9,11 సంవత్సరాలు ఉన్నప్పుడు గోళ్లు కొరకడం మొదలు పెడితే దీని దుష్ప్రభావం 13,32 ఏళ్ల మధ్యలో కనిపిస్తుందని ఒటాగో యూనిర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇలా చేయడం వలన ఒత్తిడి తగ్గుతుందో లేదో తెలియదు కానీ చాలా రోగాలు మాత్రం దరిచేరతాయి. గోళ్లకు, దంతాలకు నష్టం వాటిల్లడంతో పాటు, గోళ్లలో ఉన్న బాక్టీరియా నోట్లోకి వెళ్లి వాంతులు, విరోచనాలకు దారి తీస్తుంది.
గోళ్ల అడుగుభాగంలో సాల్మొనెల్లా, ఈ-కొలి అనే బాక్టీరియా ఉంటుంది. గోళ్లను కొరినప్పుడు ఇవి ముందు నోట్లోకి.. అక్కడి నుంచి పేగుల్లోకి చేరుకుంటాయి. దాంతో జీర్ణకోశం ఇన్ఫెక్షన్‌కి గురవుతుంది. ఫలితంగా అతిసారం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా గోళ్లు కొరికే అలవాటు ఉంటే పారానైకియా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. వేళ్ల చివరన చర్మం మీద పడే పంటిగాట్ల ద్వారా బాక్టీరియా లేదా ఈస్ట్ లోపలికి ప్రవేశించి గోళ్ల కింద వాపు, చర్మం ఎర్రబడడం, చీము కారడం వంటి సమస్యలు వస్తాయి. సర్జరీ చేసి చీముని బయటకు తీయాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది. కొన్ని రకాల క్రిములు శరీరంలోకి వెళ్లి వ్యాధి నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
మరి ఈ అలవాటు మానేదెలా అంటే..
ముందు ఇది మంచి అలవాటు కాదని దీన్ని మానెయ్యాలని మీకు బలంగా అనిపించాలి. గోళ్లను కొరకడానికి వీల్లేనంతగా పొట్టిగా కత్తిరించుకోవాలి. అమ్మాయిలైతే తరచూ మానిక్యూర్ చేయించుకుంటూ ఉండండి. వాటిని అందంగా ట్రిమ్ చేసి ఎప్పుడూ నెయిల్ పాలిష్ ఉండేలా చూసుకోండి. దీంతో అందంగా ఉన్న గోళ్లను నోట్లో పెట్టుకోవాలంటే కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. క్యాల్షియం లోపం ఉంటే కూడా గోళ్లు కొరుకుతుంటారు. అందుకే కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను, పాలు, పాల ఉత్పత్తులను తీసుకుంటూ ఉండాలి.
ఎప్పుడూ ఏదో ఒకపనిలో నిమగ్నమవండి. ఖాళీగా ఉంటే కూడా గోళ్లు కొరకాలని అనిపిస్తుంటుంది. ఒత్తిడి కారణంగా గోళ్లు కొరుకుతుంటే దానికోసం యోగా, ప్రాణాయామం సాధన చేయండి. చేతికి రిస్ట్ బ్యాండ్ పెట్టుకుని గోళ్లు కొరకాలనిపించినప్పుడల్లా దాన్ని లాగి వదలండి. నోట్లో ఆర్బిట్ లాంటివి వేసుకుని ఖాళీగా లేకుండా నములుతూ ఉండండి. ఇన్ని చెప్పారు ఇవన్నీ గుర్తుంటాయా.. ఎలా మానడం అని మళ్లీ గోళ్లు నోట్లో పెట్టుకుని ఆలోచిస్తున్నారా.. అయితే అర్జంటుగా వేప క్యాప్స్యూల్స్ మెడికల్ షాపులో దొరుకుతాయి అవి తెచ్చి మీ వేళ్లకు పూసుకోండి. దాంతో గోళ్లు నోట్లో పెట్టుకున్నప్పుడు చేదుగా ఉంటుంది. అప్పుడైనా మానేస్తారని ఆశిస్తూ..
The post మీరు గోళ్లు కొరుకుతున్నారా? అయితే ఈ సంచలన విషయాలు మీకోసం …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2Gou0Rr


No comments:
Post a Comment