నేటి సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచార ఘటనలపై రష్మీ గౌతమ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని నరికిపారేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది రష్మీ. బీహార్ రాష్ట్రంలో ఓ టీనేజ్ అమ్మాయిపై నలుగురు యువకులు అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి యత్నించగా, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆ నలుగురు యువకులు ఆమెపై యాసిడ్ దాడి చేసి పరారయ్యారు.
ఈ హృదయ విషాదకర ఘటనపై ట్విట్టర్ వేదికగా రష్మీ స్పందిస్తూ.. ‘‘దేశంలో ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రతీ ఘటన గతంలో జరిగిన ఘటనల కంటే ఎంతో భయానకంగా ఉంటోంది. మగాళ్లమని భావిస్తూ, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిని వెంటనే నరికిపారేయాలి. లేకపోతే ఒక్క రాత్రిలోనే స్త్రీ అనేదే కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వారిపై తగిన చర్యలు తీసుకున్నప్పుడే మానవాళికి స్త్రీ జాతి విలువ అనేది తెలుస్తుంది’’ అని పేర్కొంది.
The post వారిని నరికిపరేయాలి, అలా చేసినప్పుడే స్త్రీ జాతి విలువ తెలుస్తుంది.. రష్మీ ఫైర్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2L0I09I
No comments:
Post a Comment