etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 13, 2019

నిక్‌ విషయంలో నా అంచనా తప్పింది, పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే : ప్రియాంక

బాలీవుడ్‌ – హాలీవుడ్‌లలో ప్రస్తుతం మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌ ఎవరైనా ఉన్నారా అంటే అభిమానులు ఠక్కున చెప్పే పేరు ప్రియానిక్‌దే. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా- హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌లు గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వయస్సులో పదేళ్ల వ్యత్యాసం ఉండటం, శ్వేతజాతీయేతర వ్యక్తి నిక్‌ను పెళ్లాడటం నచ్చని హాలీవుడ్‌ పత్రికలు ఇప్పటికే వివాహ బంధాన్ని విమర్శిస్తూ కథనాలు ప్రచురించాయి. అంతేకాదు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్లు కూడా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై తన భర్త నిక్‌ గురించి ప్రియాంక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

న్యూయార్క్‌లో జరిగిన 10వ అంతర్జాతీయ మహిళా వార్షికోత్సవ సదస్సులో యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌ హోదాలో ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, శరణార్థి క్యాంపుల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గళం వినిపించారు. అనంతరం తన భర్త గురించి ప్రశ్నించగా.. ‘ పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే నిక్‌ నాకు తెలుసు. కానీ తనను పెళ్లి చేసుకుంటానని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. నిక్‌ విషయంలో నా అంచనా తప్పింది. కానీ తనతో ప్రయాణం మొదలు పెట్టినపుడు తెలిసింది నేనెంత తప్పుగా ఆలోచించానో. అన్ని విషయాల్లో తను నాకు అండగా నిలిచే భర్త దొరికాడు. నేను తనని ఓల్డ్‌ మాన్‌ జోనస్‌ అని పిలుస్తా. ఎందుకంటే తను చాలా స్మార్ట్‌, నాకు ఎప్పుడు ఏం కావాలో చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు. చిన్న పిల్లలా మారాం చేస్తూ ఏది కావాలన్నా, ఎక్కడున్నా తీసుకువచ్చి నా ముందు పెడతాడు అంటూ నిక్‌ జోనస్‌ వ్యక్తిత్వం గురించి చెబుతూ ప్రియాంక చిరునవ్వులు చిందించారు.

The post నిక్‌ విషయంలో నా అంచనా తప్పింది, పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే : ప్రియాంక appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2G8AdRd

No comments:

Post a Comment