ఉదయం నిద్రలేవగానే.. బ్రష్ పట్టుకుని బాత్‌రూంలోకి వెళ్తాం. అందుబాటులో ఉన్న లేదా.. టివీ ప్రకటల్లో నచ్చిన పేస్ట్‌ను వాడి..దంతాలు మెరుస్తున్నయా ? లేదా అని అద్దంలో చూసుకుంటాం. అయితే టూత్ పేస్ట్ వాడకం వల్ల కలిగే నష్టాలను తెలుసుకోం. టూత్‌పేస్ట్‌లు వాడితే వచ్చే అనారోగ్య సమస్యలపై ఇటీవల పరిశోధనలు జరిగాయి..
టూత్ పేస్ట్ వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయట. నోటిలోని క్రిములను నాశనం చేసేందుకు టూత్ పేస్ట్‌లలో ”ట్రిక్లోసెన్”అనే రసాయనాన్ని కలుపుతారట. దీని కారణంగా థైరాయిడ్, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్ వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టూత్ పేస్టులలో పాలీ ఇథైలిన్ ఉంటుంది. ఈ రసాయనం శరీరానికి విషపదార్థం మాదిరిగా భావించాలి. దీని కారణంగా మూత్రపిండాలు, మెదడు సమస్యలు వస్తాయట. టూత్ పేస్ట్ తయారీలో ప్లోరైడ్‌ను ఎక్కువగా వాడతారు. ఇవి చిగుళ్ళను మాత్రమే కాకుండా, పిల్లలలో తెలివి తేటలను తగ్గించి వేస్తాయి. గర్భిణులు ప్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్‌ల వాడకపోవడమే మంచిది. వీటి వలన థైరాయిడ్ సమస్యలతో పాటు ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. కడుపులోని బిడ్డ ఎముకల దృఢత్వాన్ని ఫ్లోరైడ్ అడుకుంటుంది. సోడియం లారిల్ సల్ఫేట్‌ను టూత్‌పేస్టు తయారీలో కూడా వాడతారు. వీటి వలన నోట్లో అల్సర్‌లు, చర్మ సమస్యతో పాటు హార్మోన్లలో అసమానతలు కూడా తలెత్తుతాయి.
తీపి పదార్థాలు ఎక్కువగా తింటే దంతాలు పాడవుతాయి అంటారు. కానీ, టూత్‌పేస్ట్‌లలో కూడా చక్కెర ఉంటుంది. ఈ కృత్రిమ చక్కెరల వల్ల మధుమేహం, స్థూలకాయం వస్తుందని పరిశోధనలలో వెలువడింది. అంతే కాకుండా, టూత్‌పేస్ట్‌లలో ఎక్కువగా ఉపయోగించే రసాయనాల వల్ల బ్రెయిన్ ట్యూమర్ వంటి క్యాన్సర్ సమస్యలు కూడా వస్తాయట. సో… దంతాలు మిలమిల మెరవాలం టూ వాడే టూత్‌పేస్ట్‌లతో ఇన్ని సమస్యలు ఉన్నాయి అన్న విషయం తెలుసుకున్న తర్వాత మన పూర్వీకుల మాదిరిగా.. వేపపుల్లలు, ఉత్తరేణి వేర్లు, బొగ్గుపొడి వాడటమే ఉత్తమం అనిపిస్తుంది కదూ..!
The post టూత్ పేస్ట్ లో ఉప్పు వేప లవంగం ఉన్నాయో లేవో తెలీదు కానీ కెమికల్స్ మాత్రం ఫుల్ గా ఉన్నాయి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2IDtoLh


No comments:
Post a Comment