etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 20, 2019

RRR సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ కోసం 20 కోట్లు! ఎలా ఉంటుందో తెలుసా ….?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు. ఆలియా భట్ ఒక హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్‌ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు జక్కన్న.

కాగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటునన్న ఈ చిత్రంలోని కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. ముఖ్యంగా హీరోల ఎంట్రీ విషయంలో భారీ హంగులు జోడించి చిత్రీకరించారట. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఎంట్రీ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయ మేర ఖర్చు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సన్నివేశం చిత్రంలోని హైలైట్ సన్నివేశాల్లో ఒకటిగా ఉంటుందని అంటున్నారు.

The post RRR సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ కోసం 20 కోట్లు! ఎలా ఉంటుందో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2UpRZ7K

No comments:

Post a Comment