ఆ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని వారంతా భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించి అంధకారంగా మారింది. ఇంతలో 19ఏళ్ల యువకుడు హీరోలా అక్కడికి వచ్చాడు. 14 మందిని రక్షించాడు. ఈ ఘటన చైనాలోని లియానింగ్ నగరంలో జరిగింది. లాన్ జుంజే అనే కుర్రోడు అక్కడే కన్ స్ట్రక్షన్ సైట్ లో క్రేన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. పక్కనే భవనంలో నుంచి మంటలు చెలరేగడం చూసి అప్రమత్తమయ్యాడు. క్రేన్ సాయంతో మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. మంటలు ఎగసిపడుతున్నా ఏమాత్రం భయపడలేదు. క్రేన్ సాయంతో భవనంలో చిక్కుకున్న 14 మందిని 30 నిమిషాల్లో రక్షించాడు. ఈ సందర్భంగా జుంజే మాట్లాడుతూ.. ఆ సమయంలో నేను నా గురించి ఏం ఆలోచించలేదు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడంపైనే దృష్టిపెట్టాను’అని చెప్పాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కుర్రాడి ధైర్యసాహాసాలను చూసి సూపర్ హీరో అంటూ మెచ్చుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
The post నిజంగానే సూపర్ హిరో …! భవనంలో మంటలు..14 మందిని కాపాడాడు! వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2YtDzWP
No comments:
Post a Comment