కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు మొన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది
ఇది ఇలా ఉండగా ఒక్క పక్క జనసేన పార్టీ ఓడిపోయిన కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లో కానీ,జనసేన పార్టీ నాయకులలో కానీ ఎలాంటి ఆత్మ విశ్వాసం కోల్పోలేదు..ఓడిపోయామే అనే బాధ కంటే “ఎక్కడో తప్పు జరిగింది..ప్రజా సేవా చెయ్యాలి మరింత శ్రద్దగా చెయ్యాలి ” అనే కసి అభిమానుల్లోనూ ,జనసేన పార్టీ నాయకుల్లోను ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లోను కనిపిస్తుంది..ఒక్క రూపాయి డబ్బు ,మందు పంచకుండా ,0 బడ్జెట్ పాలిటిక్స్ నినాదం తో ముందుకి వచ్చిన జనసేన పార్టీ కి 22 లక్షల మంది ఓట్లు వేశారు..ఇది సామాన్యమైన విషయం కాదు..అంటే పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న మార్పు కి తొలి అడుగు పడినట్టే అని అనుకోవాలి..పవన్ కళ్యాణ్ నినదించిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ రాజకీయ విశ్లేషకులను విపరీతంగా ఆకర్షిస్తోంది..దీని గురించి తమిళ్ నాడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల మీడియా ముందు మాట్లాడుతూ ” దేశం లో ఒక్క రూపాయి కూడా పంచకుండా రాజకీయాలు చేసేవాడే సమూలమైన మార్పుని తీసుకొని రాగలరు..ఈ ప్రయత్నం చేసినందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను..జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ఇన్ని ఓట్లు సంపాదించడం అంటే మాటలు కాదు..రాబొయ్యే రోజుల్లో దేశం గర్వించ దగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ అవుతాడు అనే విషయం లో ఎలాంటి సందేహం లేదు..” అంటూ రజినికాంత్ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసాడు
ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది
The post పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2VXGCou
via IFTTT

No comments:
Post a Comment