గుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె.. మారిన జీవన శైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఈ బాపతు ఏటా కోటి కేసులు నమోదవుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఎందరో. ఇప్పుడున్న ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడిల మధ్య, ఎన్నో సమస్యల మధ్య బతుకుతున్నాం, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో నెలకొకసారి అయిన ఆసుపత్రికి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె నొప్పితో బాధపడుతున్నారు, కొన్ని సంవత్సరాల క్రితం వరకు 50 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే గుండెనొప్పితో బాధపడేవారు, కానీ ఇప్పుడు 25 ఏళ్ళు కూడా నిండని వారు కూడా గుండె నొప్పితో బాధపడుతున్నారు.
మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ.. ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 25 ఏళ్ళ వయసువారిలోనూ గుండె పోటు మరణాలు పెరిగిపోతున్నాయి, మొదటిసారి వచ్చినప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే గుండె నొప్పిని చాలావరకు నియంత్రించవచ్చు. గుండె నొప్పి రావడానికి ముందు మన శరీర ఆరోగ్యంలో కొన్ని మార్పులు జరుగుతాయని కొన్ని పరిశోధనలు చేసిన వైద్యులు తెలిపారు.. గుండె నొప్పి లక్షణాలని ముందే గమనించి తగిన చికిత్స చేయించుకుంటే ప్రాణాలని కాపాడుకోవచ్చావని, తీవ్రమైన గుండె నొప్పి రావడానికి నెలరోజుల ముందు నుండే మన శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయని వారు తెలిపారు.. వాటి గురుంచి తెలుసుకోండి.
గుండె నొప్పి రావడానికి ముందు కనిపించే లక్షణాలు:
గుండె నొప్పి రావడానికి ముందే కనిపించే లక్షణాలలో ముఖ్యమైనది శరీరం పై భాగం నుండి ఎడమ చేయి కింది వరకు నొప్పి ఉండటం, ఇలా అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఛాతిలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచనే అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలోచించకూడదు. వైద్యున్ని సంప్రదించి తక్షణమే తగిన చికిత్స చేయించుకోవాలి. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస ఆడకపోవడం. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి.
మత్తు మత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటున్నా, చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ వికారంగా తిప్పినట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణమవకపోతున్నా, గ్యాస్, అసిడిటీ వంటివి తరచూ వస్తున్నా, కడుపు నొప్పి వస్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే లక్షణాలుగానే భావించాలి. చాలా మంది గుండె నొప్పి ప్రారంభ క్షణాలను అసిడిటీతో వచ్చే ఛాతీ నొప్పిగా పొరపడుతుంటారు. జలుబు, ఫ్లూ జ్వరం తరచుగా వస్తున్నా, అవి ఓ పట్టాన తగ్గకున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచికలుగా నిలుస్తాయి. దీంతోపాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.
The post హార్ట్ ఎటాక్ వస్తుందనగా నెల రోజుల ముందు నుండే మన శరీరంలో జరిగే మార్పులు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2E57yfO



No comments:
Post a Comment